తెలంగాణ గిరిజన పథకాలు ఆదర్శం

రాష్ట్రంలో గిరిజన విద్య, అటవీ ఉత్పత్తుల ప్రోత్సాహానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ అందరికీ ఆదర్శమని తమిళనాడు గిరిజన సంక్షేమ సంచాలకులు తిరు.ఎస్‌.అన్నాదురై ప్రశంసించారు.

Published : 01 Dec 2022 04:47 IST

తమిళనాడు ఉన్నతాధికారి ప్రశంస

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గిరిజన విద్య, అటవీ ఉత్పత్తుల ప్రోత్సాహానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ అందరికీ ఆదర్శమని తమిళనాడు గిరిజన సంక్షేమ సంచాలకులు తిరు.ఎస్‌.అన్నాదురై ప్రశంసించారు. గిరిజనుల అభివృద్ధికి ఇక్కడి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన వ్యవస్థ బాగుందని కితాబిచ్చారు. తమిళనాడు గిరిజన సంక్షేమశాఖ ప్రతినిధి బృందం నవంబరు 28, 29, 30 తేదీల్లో భద్రాచలం ఐటీడీఏ పరిధిలో అమలవుతున్న పలు కార్యక్రమాలకు తిలకించింది. ఈ సందర్భంగా గురుకుల ఆశ్రమ పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు, ఎఫ్‌పీవోలు, చిన్న తరహా పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు తదితరాలను పరిశీలించింది. బృందసభ్యులు బుధవారమిక్కడ సంక్షేమభవన్‌ ఆవరణలోని నెహ్రూ శతజయంతి గిరిజన మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి గిరిజన సంక్షేమశాఖ పరిపాలన గురించి ఆ శాఖ కార్యదర్శి క్రిస్టీనా వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిపాలన వ్యవస్థ, గిరిజన ఉత్పత్తుల ద్వారా లభిస్తున్న ఆదాయం, అక్కడి అభివృద్ధికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని