గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం

ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ) డీన్‌ ప్రమత్‌ రాజ్‌సిన్హా దీన్ని అందజేశారు.

Published : 04 Jun 2023 04:38 IST

పటాన్‌చెరు, న్యూస్‌టుడే: ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ) డీన్‌ ప్రమత్‌ రాజ్‌సిన్హా దీన్ని అందజేశారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న మాట్లాడుతూ అత్తెసరు మార్కులతో ఎంఏ(తెలుగు) ఉత్తీర్ణుడైన తనను డాక్టరేట్‌తో సత్కరించడం ఆనందాన్నిచ్చిందన్నారు. ఐఎస్‌బీ డీన్‌ ప్రమత్‌ రాజ్‌సిన్హా మాట్లాడుతూ కనిపెంచిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పించిన గురువుల పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలన్నారు. ఈ సందర్భంగా 1,141 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. 21 మందికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. ‘గీతం’ అధ్యక్షుడు శ్రీభరత్‌, కార్యదర్శి భరద్వాజ్‌, ఉపకులపతి దయానంద్‌, అదనపు ఉపకులపతి డీఎస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని