Guntur: మృతుని పేరు మీద 12 ఏళ్లుగా పింఛను

21 ఏళ్ల క్రితం మృతి చెందిన తండ్రి పేరుతో 12 ఏళ్లుగా కుమారుడు వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న వైనం సోమవారం వెలుగు చూసింది.

Updated : 06 Jun 2023 09:58 IST

కుమారుడిపై బంధువుల ఫిర్యాదు

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే: 21 ఏళ్ల క్రితం మృతి చెందిన తండ్రి పేరుతో 12 ఏళ్లుగా కుమారుడు వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న వైనం సోమవారం వెలుగు చూసింది. మృతుని బంధువులు పారా బాబూరావు, పారా జ్యోతి, పారా క్రాంతి తెలిపిన ప్రకారం.. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరుకు చెందిన పారా కిరీటి 2001లో మృతి చెందారు. జీవించి ఉండగా ఆయన ఎప్పుడూ పింఛను తీసుకున్న దాఖలా లేదు. అయితే ఆయన చిన్న కుమారుడు తన మామను తండ్రిగా చూపించి పింఛనుకు దరఖాస్తు చేస్తే 2011లో అధికారులు మంజూరు చేసేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయనకు వృద్ధాప్య పింఛన్‌ చెల్లిస్తున్నారు. ఇదే అంశంపై గత నెలలో మృతుని బంధువులు అధికారులను కలిసి కిరీటి మరణ ధ్రువపత్రం సమర్పించి, ఫిర్యాదు చేశారు. అయినా ఈ నెలలోనూ అధికారులు రూ.2750 పింఛను ఇచ్చేశారు. దీనిపై మృతుడి బంధువులు తాజాగా జేసీకి ఫిర్యాదు చేశారు. మరణించిన వ్యక్తి పేరుతో 144 నెలలుగా అక్రమంగా పింఛను తీసుకుంటూ ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారని, ఇప్పటి వరకు రూ.4 లక్షల మేర పింఛను పొందారన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని డీడీవో మహాలక్ష్మిని జేసీ శ్యాంప్రసాద్‌ ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని