నకిలీ ఎరువుల నిరోధానికి కేంద్రం చట్టం తేవాలి

వ్యవసాయంలో నకిలీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, నాసిరకం యంత్ర పరికరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక సమగ్రచట్టం తేవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 12 Jul 2023 03:55 IST

వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయంలో నకిలీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, నాసిరకం యంత్ర పరికరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక సమగ్రచట్టం తేవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పురుగుమందుల నాణ్యత ప్రమాణాలను గుర్తించటానికి కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.  నాణ్యమైన దిగుబడి, రైతుల ఆదాయం పెంపునకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల పాత్రపై వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించిన సదస్సులో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.  విశ్వవిద్యాలయ విస్తరణ సంస్థ రూపొందించిన సంచార ప్రచార వాహనాలను, మొబైల్‌ అగ్రి సపోర్ట్‌ సర్వీసెస్‌(మాస్‌)ని మంత్రి ప్రారంభించారు. సదస్సులో వ్యవసాయశాఖ కార్యదర్శి, ఇన్‌ఛార్జి ఉపకులపతి రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్‌ హనుమంతు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని