కేటీఆర్‌కు అంతర్జాతీయ సదస్సు ఆహ్వానం

అంతర్జాతీయ ఐటీ ఆవిష్కరణల సంస్థ(ఐటీఐఎఫ్‌) సెప్టెంబర్‌ 13న జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ప్రపంచ వాణిజ్య, ఆవిష్కరణల విధానంపై నిర్వహించే వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది.

Updated : 16 Jul 2023 06:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయ ఐటీ ఆవిష్కరణల సంస్థ(ఐటీఐఎఫ్‌) సెప్టెంబర్‌ 13న జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ప్రపంచ వాణిజ్య, ఆవిష్కరణల విధానంపై నిర్వహించే వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ మేరకు ఐటీఐఎఫ్‌ ఉపాధ్యక్షుడు స్టీఫెన్‌ ఎజెల్‌ శనివారం ఆయనకు లేఖ రాశారు. అధునాతన, సాంకేతిక రంగాల్లో విదేశీ, స్వదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ సాధించిన ప్రగతి, ఆర్థిక, సామాజిక సమస్యల పరిష్కారానికి డిజిటల్‌ సాంకేతికత తోడ్పాటు అంశాల గురించి సదస్సులో ప్రసంగించాలని కేటీఆర్‌ను కోరారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక, వాణిజ్య సవాళ్లకు సృజనాత్మక పరిష్కారంపై ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాధినేతలు, వ్యాపార, వాణిజ్య, విద్యావేత్తలు సదస్సులో పాల్గొంటారని లేఖలో వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు