Medaram: ‘మేడారం’ మహాజాతరకు 72 రోజులే..

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు వేళవుతోంది. రెండేళ్లకోసారి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు.

Updated : 10 Dec 2023 06:39 IST

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు వేళవుతోంది. రెండేళ్లకోసారి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు. ఆదివాసీ సంప్రదాయబద్ధంగా నిర్వహించే మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది. ప్రతిసారి కనీసం నాలుగు నెలల ముందు నుంచైనా జాతర నిర్వహణ ఏర్పాట్లు, అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. మొత్తం 21 శాఖలు రూ.75 కోట్ల విలువైన ప్రతిపాదనలను జులైలోనే సిద్ధం చేశాయి. దాదాపు 5 నెలలు అవుతున్నా నిధులు కేటాయించలేదు. నిధుల విడుదలలో జాప్యం వల్ల పనులు ఇప్పటికీ పట్టాలెక్కలేదు.

చేపట్టాల్సిన పనులెన్నో..

జాతరలో రహదారుల నిర్మాణం, మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు, క్యూలైన్లు, స్నానఘట్టాలు, కల్యాణకట్టలు, చెక్‌డ్యాంలు, హోల్డింగ్‌ పాయింట్లు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, డంప్‌యార్డులు తదితర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. జాతరకు 72 రోజులు మాత్రమే ఉంది.


నిధుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం

నిధుల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. మధ్యలో కోడ్‌ రావడంతో నిధుల కేటాయింపులో ఆలస్యం అయింది. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయ్యాయి. జాతర ఏర్పాట్లపై దృష్టి పెట్టాం. నిధుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. త్వరలోనే పనులు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాం.

అంకిత్‌, ఐటీడీఏ, పీవో ఏటూరునాగారం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని