Ponnam Prabhakar: ప్రజాపాలన దరఖాస్తులకు గడువు పెంపు లేదు

రాష్ట్రంలో ఈ నెల ఆరో తేదీ వరకే ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం కొనసాగుతుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Updated : 03 Jan 2024 08:38 IST

కేసీఆర్‌ స్క్రిప్టునే కిషన్‌రెడ్డి చదువుతున్నారు
మంత్రి పొన్నం ప్రభాకర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల ఆరో తేదీ వరకే ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం కొనసాగుతుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ప్రజా పాలన దరఖాస్తులు సమర్పించేందుకు గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాల గడువు పొడిగింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 6 తర్వాత మండల కేంద్రాల్లో యథావిధిగా అర్జీలు సమర్పించవచ్చని చెప్పారు. మంగళవారం సచివాలయంలో పొన్నం ప్రభాకర్‌ విలేకరులతో మాట్లాడారు. ‘‘భారాస, భాజపాలకు మధ్య అవగాహన ఉందన్న విషయం అందరికీ తెలుసు.. కేసీఆర్‌ స్క్రిప్ట్‌ను కిషన్‌రెడ్డి, ఇతర భాజపా నేతలు చదువుతున్నారు. కేసీఆర్‌ను రక్షించేందుకు భాజపా మేడిగడ్డపై సీబీఐ విచారణ జరిపించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని దిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసు.. దీనిపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించాం. జ్యుడిషియల్‌ విచారణకు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన న్యాయశాఖ.. సుప్రీం, లేదా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జిని నియమించాలి. దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని భాజపా నేతలే అంటున్నారు. మరి కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవ చూపాలి’’ అని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని