దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్‌ ఏ మెర్సినరీ? నోట్స్‌ ఫ్రమ్‌ మై లైఫ్‌ అండ్‌ కెరీర్‌’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు.

Published : 23 Apr 2024 05:13 IST

హైదరాబాద్‌లో పుస్తకావిష్కరణ రేపు

ఈనాడు, హైదరాబాద్‌: రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్‌ ఏ మెర్సినరీ? నోట్స్‌ ఫ్రమ్‌ మై లైఫ్‌ అండ్‌ కెరీర్‌’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. దీనిని ఈ నెల 24న హైదరాబాద్‌ పటాన్‌చెరులోని గీతమ్‌ యూనివర్సిటీ ‘కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ’లో జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. ఐఏఎస్‌ అధికారిగా దువ్వూరి సుబ్బారావు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ శాఖల్లో పనిచేశారు. కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగానూ వ్యవహరించారు. ఆ తర్వాత అత్యున్నతమైన రిజర్వు బ్యాంకు గవర్నర్‌ పదవి ఆయన్ను వరించింది. దేశం ఆర్థికంగా అత్యంత సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆర్బీఐ గవర్నర్‌గా సమర్థంగా విధులు నిర్వర్తించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలను పుస్తక రూపంలో తీసుకొస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని