జేఈఈ మెయిన్‌లో నారాయణ హవా

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు.

Published : 26 Apr 2024 04:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. వందలోపు 28 ర్యాంకులు, వెయ్యిలోపు 171 ర్యాంకులతో నారాయణ విజయప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగించినట్లు పేర్కొన్నారు. ఆలిండియా అన్ని కేటగిరీల్లో పదిలోపు 25 ర్యాంకులు, 100లోపు 112 ర్యాంకులు 1000లోపు 735 ర్యాంకులు కైవసం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆయా విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

శ్రీచైతన్య సంచలనం

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో శ్రీచైతన్య సంచలన రికార్డు నమోదు చేసిందని ఆ విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మశ్రీ వెల్లడించారు. అఖిల భారత స్థాయిలో కేసీ బసవరెడ్డి-1వ ర్యాంకు, టీహెచ్‌ నిఖిలేష్‌-3, టీహెచ్‌ హిమాన్షు-6, ఆర్‌.అనిల్‌-9వ ర్యాంకుతో సత్తా చాటారని తెలిపారు. ఓపెన్‌ కేటగిరీలో 200లోపు 46 ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని సుష్మశ్రీ అభినందించారు.

భాష్యం విద్యార్థుల సత్తా

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో తమ విద్యార్థులు 18, 36 ర్యాంకులు సాధించినట్లు భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్‌ రామకృష్ణ తెలిపారు. వివిధ కేటగిరీల్లో ఆలిండియాలో వందలోపు 12 ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. 200లోపు 25, 500లోపు 54, 1000లోపు 78 ర్యాంకులను తమ విద్యార్థులు కైవసం చేసుకున్నట్లు వెల్లడించారు. విద్యార్థులను అభినందించారు.

సత్తాచాటిన ఎస్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధించారని ఎస్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ ఛైర్మన్‌ ఎ.వరదారెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఓపెన్‌ కేటగిరీలో డి.మనీష్‌-126వ ర్యాంకు, రిజర్వేషన్‌ కేటగిరీలో ఆలిండియా స్థాయిలో జి.నవీన్‌ 5వ ర్యాంకు, ఎ.నందిని-12, వై.సాత్విక్‌ రెడ్డి-42, జి.కలు-55వ ర్యాంకు సాధించారని తెలిపారు. విద్యార్థులకు, విద్యాసంస్థల డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

అల్ఫోర్స్‌కు ర్యాంకులు

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో అల్ఫోర్స్‌ విద్యార్థులు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు విద్యాసంస్థల ఛైర్మన్‌ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. వెయ్యిలోపు 5 ర్యాంకులు, 5 వేల లోపు 34 ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. 461 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారని పేర్కొన్నారు.

రెసొనెన్స్‌ విద్యార్థుల ప్రతిభ

జేఈఈ మెయిన్‌ పరీక్షలో తమ విద్యార్థులు ఐదుగురు 100 పర్సంటైల్‌ సాధించారని రెసొనెన్స్‌ జూనియర్‌ కళాశాలల హైదరాబాద్‌ డైరెక్టర్‌ పూర్ణచంద్రరావు తెలిపారు. 336 మంది 99 పర్సంటైల్‌ కంటే ఎక్కువ మార్కులు సాధించారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని