గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఫైన్‌ ఆర్ట్స్‌, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ కోర్సులు

గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని మహిళల ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ (సిరిసిల్ల)లో బీఏ ఆనర్స్‌ ఫ్యాషన్‌ డిజైన్‌, ఇంటీరియర్‌ డిజైన్‌, ఫొటోగ్రఫీ-డిజిటల్‌ ఇమేజింగ్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు.

Published : 08 May 2024 03:58 IST

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని మహిళల ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ (సిరిసిల్ల)లో బీఏ ఆనర్స్‌ ఫ్యాషన్‌ డిజైన్‌, ఇంటీరియర్‌ డిజైన్‌, ఫొటోగ్రఫీ-డిజిటల్‌ ఇమేజింగ్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థినులు ఈ నెల 10 నుంచి 30 వరకు సిరిసిల్ల కళాశాలలో దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు. వరంగల్‌ జిల్లా అశోక్‌నగర్‌లోని గిరిజన గురుకుల ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ అకాడమీ (పురుషులు)లో బీఎస్సీ ఎంపీసీ, బీఏ హెచ్‌ఈపీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 10 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు గిరిజన గురుకుల సొసైటీ, గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు