50 శాతం ఫిట్‌మెంట్‌తో కొత్త వేతన సవరణ జరగాలి

తెలంగాణలో 50 శాతం ఫిట్‌మెంట్‌తో కొత్త వేతన సవరణ జరగాలని పీఆర్‌టీయూటీఎస్‌ సంఘం పీఆర్‌సీ ఛైర్మన్‌ శివశంకర్‌ను కోరింది.

Published : 08 May 2024 03:59 IST

పీఆర్‌టీయూటీఎస్‌ ప్రతిపాదన

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో 50 శాతం ఫిట్‌మెంట్‌తో కొత్త వేతన సవరణ జరగాలని పీఆర్‌టీయూటీఎస్‌ సంఘం పీఆర్‌సీ ఛైర్మన్‌ శివశంకర్‌ను కోరింది. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం కొనసాగించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు సైతం ఓపీఎస్‌ను వర్తింపజేయాలని అభ్యర్థించింది. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు బి.మోహన్‌రెడ్డి, పూల రవీందర్‌, మాజీ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి, పీఆర్‌జీటీఏ అధ్యక్షుడు వి.దిలీప్‌రెడ్డిలు మంగళవారం శివశంకర్‌ను బీఆర్‌కే భవన్‌లో కలిసి కొత్త పీఆర్‌సీపై తమ ప్రతిపాదనలు సమర్పించారు. నగదు రహిత ఆరోగ్య పథకాన్ని కొత్తగా తీర్చిదిద్దాలని, అప్రయత్న పదోన్నతులు 5/10/15/20/25 సంవత్సరాల శ్లాబ్‌లతో ఉండాలని, హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లు 15%/17%/24%గా ఉండాలని కోరారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు కనీస టైమ్‌స్కేలును ఇచ్చి సమయానుగుణంగా క్రమబద్ధీకరించాలని, ఎయిడెడ్‌, మోడల్‌ పాఠశాలలు, అన్ని సొసైటీల గురుకుల అధ్యాపకులకు 010 పద్దు ద్వారా వేతనాలు ఇవ్వాలని, సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు 13వ వేతన గ్రేడ్‌, 2017 టీఆర్‌టీ ఉపాధ్యాయులకు అదనంగా నాలుగు ఇంక్రిమెంట్లు, గెజిటెడ్‌ హెడ్మాస్టర్లకు ఎంఈవోలతో సమానంగా వేతన స్కేలు ఇవ్వాలని, 50 సంవత్సరాలు పూర్తయిన వారికి డిపార్ట్‌మెంట్‌ పరీక్షల నుంచి మినహాయింపునివ్వాలని, ఎల్‌టీసీకి ఒక నెల వేతనంతో పాటు విమాన ఛార్జీలను చెల్లించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు