పలు జిల్లాల్లో భారీ వర్షాలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated : 10 May 2024 05:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా భీమారం మండలం గోవిందారంలో 4.5 సెం.మీ, భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం సీతారాంపట్నం 4.4, భద్రాచలం 3, హనుమకొండ జిల్లా వేలేరు    2.7, నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ 2.7, జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి, రాజోలి మండలాల్లో 2.4, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధారి, కెరమెరి మండల కేంద్రంలో 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్‌ జిల్లాల్లోని పలు మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మరోవైపు నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం జకోరాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 43.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌ జిల్లాలోని అనేక మండలాలతోపాటు నిర్మల్‌, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని పలు మండలాల్లో 41.5 డిగ్రీల నుంచి 43.2 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు