Published : 20 Oct 2020 21:50 IST

చేపకు గాలమేస్తే.. మొసలి చిక్కింది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ వేటగాడికి ఊహించని సంఘటన ఎదురైంది. చేపల కోసం గాలమేస్తే అతడి గాలానికి ఓ భారీ మొసలి చిక్కింది. ఆస్ట్రేలియాకు చెందిన ట్రెంట్ డీ విత్‌ కుటుంబంతో సహా ఫిషింగ్‌ కోసం క్యాథెరిన్‌లోని ఓ నదిలో వేటకు వెళ్లారు. పడవలో ఉన్న విత్‌ గాలమేయగా ఊహించని రీతిలో ఆ గాలానికి ఓ భారీ మొసలి చిక్కింది. ప్లాస్టిక్‌ చేపను ఎరగా వేయగా దాన్ని తినేందుకు వచ్చిన మొసలి గాలానికి చిక్కింది. అయితే గాలాన్ని వదిలేసేందుకు ఇష్టపడని విత్‌.. దాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు ప్రయత్నించాడు. ఎరకు చిక్కిన మొసలి సైతం విడిపించుకునేందుకు నానా తంటాలు పడింది. పలుమార్లు నీళ్లలో మునుగుతూ, తేలుతూ కనిపించింది. ఎట్టకేలకు ఎర నుంచి తప్పించుకున్న మొసలి నీటిలోకి జారుకుంది. అయితే ఘటనకు సంబంధిన వీడియోను ట్రెంట్ డీ విత్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. ఇప్పటికే ఆ వీడియోను 1.5 మిలియన్ల మంది చూశారు. మీరూ చూసేయండి.


Read latest Viral videos News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని