సంపూర్ణ ఆరోగ్యం కోసం..!
ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా మనసు పెట్టి చేయగలుగుతాం. మరి, అలాంటి సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం కావాలంటే చక్కటి పోషకాహారం తీసుకోవడమే కాదు.. తినే పద్ధతీ ముఖ్యమంటున్నారు పోషకాహార నిపుణులు.

ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా మనసు పెట్టి చేయగలుగుతాం. మరి, అలాంటి సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం కావాలంటే చక్కటి పోషకాహారం తీసుకోవడమే కాదు.. తినే పద్ధతీ ముఖ్యమంటున్నారు పోషకాహార నిపుణులు. అలాగే ఆహారంతో పాటు వ్యాయామానికీ సమ ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. ఈ క్రమంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే పాటించాల్సిన కొన్ని ప్రాథమిక సూత్రాల గురించి తెలుసుకుందాం రండి..
అందరికీ ఇవి అవసరం!
1. తినడానికీ ఓ పద్ధతుంది.. కూర్చొనే తినాలి.. అది కూడా స్పూన్స్‌తో కాకుండా చేతులతో తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే గబగబా భోజనం చేసేయడం కాకుండా.. బాగా నమిలి మనసు పెట్టి తినడం వల్ల ఒంటికి పడుతుంది.
2. తినేటప్పుడు ఇతర విషయాల గురించి ఆలోచించడం మంచిది కాదు. పూర్తి దృష్టి ఆహారం పైనే ఉండాలి.

3. రోజువారీ ఆహారంలో భాగంగా నట్స్ తీసుకోవడం మంచిది. ఉదాహరణకు.. ఉదయం పూట బాదంపప్పులు/వాల్‌నట్స్, మధ్యాహ్నం వేరుశెనగ/జీడిపప్పులు వంటివి తీసుకోవచ్చు.
4. ఆయా సీజన్లలో లభించే ఆకుపచ్చ కాయగూరలు, ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి.
5. రాగులు, జొన్నలు.. వంటి చిరుధాన్యాలను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు బరువును అదుపులో ఉంచుతాయి.
6. ప్రత్యేకించి ఇంట్లో తోడేసిన తాజా పెరుగు, మజ్జిగ తీసుకుంటే మంచిది.

7. అలాగే భోజనంలో కొద్దిగా నెయ్యి తీసుకోవడం కూడా మంచిదంటున్నారు నిపుణులు.
8. రోజూ అరగంట వ్యాయామం మనల్ని ఆ రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ఉదయం పూట చిన్న చిన్న వర్కవుట్స్ చేసేలా ప్రణాళిక వేసుకోండి.
9. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, నిద్ర లేవడం కాకుండా.. దానికంటూ ఒక కచ్చితమైన సమయం పెట్టుకొని రోజూ అదే ఫాలో అవ్వాలి.
10. తినేటప్పుడు మొబైల్‌తో కాలక్షేపం, టీవీ చూడడం.. వంటివి తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే దీనివల్ల ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో కూడా తెలియకుండా ఆహారం లాగించేస్తామట! ఫలితంగా ఆహారం రుచిని ఆస్వాదించకపోగా, బరువూ పెరిగే ప్రమాదం ఉంటుందట!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
    
    
    బ్యూటీ & ఫ్యాషన్
- నిపుల్ హెయిర్ పోవాలంటే..
 - మొటిమల సమస్యకు.. కలబంద!
 - చర్మం ముడతలు పడుతోందా?
 - అందం... అలంకరణ రెండూనూ!
 - సౌందర్య సంరక్షణకూ ‘తులసి’!
 
ఆరోగ్యమస్తు
- చక్కగా నిద్ర పట్టాలంటే..!
 - పది నిమిషాలు ఇలా చేస్తే.. ఫిట్‌గా మారిపోవచ్చుట!
 - ‘మఖానా’.. పోషకాల ఖజానా!
 - అభయ ముద్ర
 - తింటున్నా... నీరసమే!
 
అనుబంధం
- పిల్లల ముందు ఇలా చేయకూడదట!
 - ఆ రెండింటి సమన్వయానికీ..!
 - బంధం ప్రమాదకరంగా మారుతోందా..?
 - మీరు ‘మైండ్‌ఫుల్’ తల్లిదండ్రులేనా..!
 - అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారా?
 
యూత్ కార్నర్
- Shafali Verma: అందుకే అప్పుడు అబ్బాయిలా వేషం మార్చుకున్నా..!
 - జెన్ జీ అమ్మాయిలు మరచిపోతున్నారా..!
 - మీరే ఒక సైన్యం!
 - 22ఏళ్ల అమ్మాయి... 100 మందికి అమ్మయ్యింది!
 - ప్రపంచ వేదికపై ప్రకృతి ప్రతినిధి!
 
'స్వీట్' హోం
- చిమ్నీలు వాడుతున్నారా?
 - ఒత్తిడిని తగ్గించే ఫిష్ ట్యాంక్లివి..!
 - వెన్నతో.. ఇలా కూడా!
 - ఉసిరి దీపానికి స్టాండ్!
 - అందాల ఆలమండా!
 
వర్క్ & లైఫ్
- బాగా పని చేయాలంటే..!
 - అమ్మాయిలూ... ధైర్యమే మీ పెట్టుబడి!
 - అపరాధ భావంతో బాధపడుతున్నారా?
 - పొగిడితే ఆనందం!
 - బ్లూమ్ స్క్రోలింగ్ చేద్దామా..!
 































            








