వాల్‌నట్‌లు... తింటే నిద్రొస్తుంది!

మెదడుని పోలి ఉండే డ్రైఫ్రూట్‌ వాల్‌నట్‌. రుచిలో మెప్పించలేకపోయినా... ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో మాత్రం దీనికి మరేదీ సాటిరాదు. పచ్చిగానో, కాస్తంత నానబెట్టుకునో రోజూ నాలుగైదు తినిచూడండి.

Eenadu icon
By Vasundhara Team Published : 28 Oct 2025 04:50 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మెదడుని పోలి ఉండే డ్రైఫ్రూట్‌ వాల్‌నట్‌. రుచిలో మెప్పించలేకపోయినా... ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో మాత్రం దీనికి మరేదీ సాటిరాదు. పచ్చిగానో, కాస్తంత నానబెట్టుకునో రోజూ నాలుగైదు తినిచూడండి. ఎంత శక్తి వస్తుందో! ఇవి మెదడు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ప్లాంట్‌ బేస్డ్‌ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, పాలీఫెనాల్స్, విటమిన్‌ ఇ... వంటివి అల్జీమర్స్, డిమెన్షియా వంటి అనారోగ్యాలను దరిచేరనివ్వవు. ఒత్తిడినీ తగ్గిస్తాయి. అంతేనా... వాల్‌నట్స్‌లో పుష్కలంగా దొరికే పీచు, ప్రొటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌... వంటివి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతాయి.  గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక, వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు... కొన్నిరకాల క్యాన్సర్లను దరిచేరనివ్వవట. నిద్రలేమితో బాధపడే మహిళలు ఓ నాలుగైదు తింటే సరి. వీటిల్లోని మెలటోనిన్‌ హార్మోన్‌ హాయిగా నిద్రపట్టేలా చేస్తుందట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్