నోరు ఆరోగ్యంగా ఉండాలంటే..!
ఆయిల్ పుల్లింగ్ ప్రక్రియ ద్వారా బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మన వంటింట్లో ఉండే కొన్ని రకాల నూనెలతో నోటిని పుక్కిలించడం వల్ల నోరు శుభ్రపడడమే కాదు.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలూ చేకూరతాయని వారు సూచిస్తున్నారు.

ఆయిల్ పుల్లింగ్ ప్రక్రియ ద్వారా బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మన వంటింట్లో ఉండే కొన్ని రకాల నూనెలతో నోటిని పుక్కిలించడం వల్ల నోరు శుభ్రపడడమే కాదు.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలూ చేకూరతాయని వారు సూచిస్తున్నారు.
⚛ మన నోట్లో వందల సంఖ్యలో సూక్ష్మక్రిములు ఉంటాయట. అందులో కొన్ని హానికరమైనవి కూడా ఉంటాయి. అవి పంటి నొప్పి, చిగుళ్లకు సంబంధించిన వ్యాధులు, నోటి దుర్వాసనకు కారణమవుతాయి. అయితే ఆయిల్ పుల్లింగ్ ప్రక్రియ ఇలాంటి బ్యాక్టీరియాను తొలగించగలదని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.
⚛ నోటిని చక్కగా శుభ్రపరచుకోకపోవడం, నోటి ఇన్ఫెక్షన్లు, చిగుళ్లలో సమస్యల వల్ల నోటి దుర్వాసన రావడం కామన్. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే బయట దొరికే మౌత్‌వాష్‌ల కంటే మన వంటింట్లో ఉండే నూనెలే సమర్థంగా పని చేస్తాయంటున్నారు నిపుణులు.
⚛ చక్కెర, చక్కెర సంబంధిత పదార్థాలు అధికంగా తీసుకోవడం, దంతాల మధ్య చిక్కుకున్న పదార్థాల అవశేషాలను తొలగించుకోకపోవడం వల్ల పళ్లు పుచ్చిపోవడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ఆయిల్ పుల్లింగ్ మంచి చిట్కా అంటున్నారు నిపుణులు. రోజూ ఉదయాన్నే బ్రష్ చేసుకున్న తర్వాత ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల చెడు బ్యాక్టీరియా నశిస్తుందంటున్నారు.
⚛ ఈ ప్రక్రియ ద్వారా దవడ, మెడ కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుందంటున్నారు నిపుణులు.
ఎలా చేయాలంటే?
నోటి ఆరోగ్యానికి దోహదం చేసే ఆయిల్ పుల్లింగ్ ప్రక్రియను పాటించడానికీ ఓ పద్ధతుందంటున్నారు దంత వైద్య నిపుణులు. ఈక్రమంలో ముచ్చటగా ఈ మూడు చిట్కాల్ని పాటించాలని సూచిస్తున్నారు.
⚛ ఆయిల్ పుల్లింగ్‌కి కొబ్బరి/ఆలివ్/నువ్వుల నూనెలు చక్కటి ఎంపిక. వీటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకొని టేబుల్‌స్పూన్ నూనెను నోట్లోకి తీసుకోవాలి.
⚛ ఆపై 15 నుంచి ఇరవై నిమిషాల పాటు ఆ నూనె నోట్లోని మూలమూలకు వెళ్లేలా పుక్కిలిస్తూ ఉండాలి. ఈ క్రమంలో దీన్ని మింగకుండా జాగ్రత్తపడాలి. పని పూర్తయ్యాక ఉమ్మివేయాలి.
⚛ ఇక ఏదైనా తినేముందు లేదా తాగే ముందు నోటిని శుభ్రపరచుకొని ఆ తర్వాత ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే ఆహారం తీసుకున్న తర్వాత సైతం నోటిని శుభ్రపరచుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
    
    
    బ్యూటీ & ఫ్యాషన్
- చర్మం రిపేర్ చేశారా?
 - నిపుల్ హెయిర్ పోవాలంటే..
 - మొటిమల సమస్యకు.. కలబంద!
 - చర్మం ముడతలు పడుతోందా?
 - అందం... అలంకరణ రెండూనూ!
 
ఆరోగ్యమస్తు
- చక్కగా నిద్ర పట్టాలంటే..!
 - పది నిమిషాలు ఇలా చేస్తే.. ఫిట్‌గా మారిపోవచ్చుట!
 - ‘మఖానా’.. పోషకాల ఖజానా!
 - అభయ ముద్ర
 - తింటున్నా... నీరసమే!
 
అనుబంధం
- పిల్లల ముందు ఇలా చేయకూడదట!
 - ఆ రెండింటి సమన్వయానికీ..!
 - బంధం ప్రమాదకరంగా మారుతోందా..?
 - మీరు ‘మైండ్‌ఫుల్’ తల్లిదండ్రులేనా..!
 - అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారా?
 
యూత్ కార్నర్
- హ్యాట్సాఫ్... అమ్మాయిలూ
 - Shafali Verma: అందుకే అప్పుడు అబ్బాయిలా వేషం మార్చుకున్నా..!
 - జెన్ జీ అమ్మాయిలు మరచిపోతున్నారా..!
 - మీరే ఒక సైన్యం!
 - 22ఏళ్ల అమ్మాయి... 100 మందికి అమ్మయ్యింది!
 
'స్వీట్' హోం
- చిమ్నీలు వాడుతున్నారా?
 - ఒత్తిడిని తగ్గించే ఫిష్ ట్యాంక్లివి..!
 - వెన్నతో.. ఇలా కూడా!
 - ఉసిరి దీపానికి స్టాండ్!
 - అందాల ఆలమండా!
 
వర్క్ & లైఫ్
- బాగా పని చేయాలంటే..!
 - అమ్మాయిలూ... ధైర్యమే మీ పెట్టుబడి!
 - అపరాధ భావంతో బాధపడుతున్నారా?
 - పొగిడితే ఆనందం!
 - బ్లూమ్ స్క్రోలింగ్ చేద్దామా..!
 































            








