Published : 28/02/2023 13:08 IST

మా వారికి స్కిన్ అలర్జీ ఉంది.. పుట్టే పిల్లలకూ వస్తుందా?

నమస్తే డాక్టర్‌. మా వారికి చర్మ అలర్జీ ఉంది. అదే సమస్య మా పాపకి కూడా ఉంది. వారిద్దరిదీ O+ve బ్లడ్‌ గ్రూప్‌. కానీ నాది O-ve. ఇప్పుడు మేము రెండో బేబీ కోసం ప్లాన్‌ చేసుకోవాలనుకుంటున్నాం. కానీ పుట్టబోయే బేబీలో కూడా ఈ సమస్య వస్తుందేమోనని భయంగా ఉంది. అది ఎంతవరకు నిజం? మేం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకోవచ్చా? సలహా ఇవ్వండి. - ఓ సోదరి

జ. మామూలుగా అలర్జీలనేవి వంశపారంపర్యంగా రావచ్చు. అయితే ఇప్పుడున్న పాపకి అదే సమస్య వచ్చింది కాబట్టి పుట్టబోయే బేబీలో వస్తుందా, రాదా తెలియాలంటే.. అసలు మీ వారి చర్మ సమస్యేంటో కరక్ట్‌గా తెలియాలి. దాన్ని బట్టి ఇది వంశపారంపర్యంగా వచ్చేదా, కాదా అన్నది చెప్పడానికి వీలవుతుంది. అందుకే మీ వారిని, పాపను ఒకసారి చర్మవ్యాధి నిపుణులకు చూపించి సరైన వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ రిపోర్టులన్నీ తీసుకొని జెనెటిక్‌ కౌన్సెలింగ్‌కి వెళ్తే.. పుట్టబోయే బిడ్డకు అలర్జీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందో వాళ్లు చెప్పగలుగుతారు. మీరు భయపడుతున్నట్లు ఇది బ్లడ్‌ గ్రూప్‌ మీద ఆధారపడి ఉండదు. ఏదేమైనా రెండో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకోవడం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకపోవడమే మంచిది. అలాగే అలర్జీ అనేది ప్రమాదకరమైంది కాదు.. కాబట్టి మీరు దాని గురించి అంత సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని