వైఫల్యాల్ని అధిగమించి.. కెరీర్లో రాణించాలంటే..!
వృత్తిఉద్యోగాల్లో మనం ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటాం.. వాటిలో కొన్ని సఫలమవ్వచ్చు.. మరికొన్ని విఫలమవ్వచ్చు. అయితే చాలామంది ఇలాంటి వైఫల్యాల గురించే ఆలోచిస్తూ ఇక తాము కెరీర్‌లో రాణించలేమనుకుంటారు. ఇతరులతో పోల్చుకుంటూ తీవ్ర ఒత్తిడిలోకి కూరుకుపోతుంటారు....

వృత్తిఉద్యోగాల్లో మనం ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటాం.. వాటిలో కొన్ని సఫలమవ్వచ్చు.. మరికొన్ని విఫలమవ్వచ్చు. అయితే చాలామంది ఇలాంటి వైఫల్యాల గురించే ఆలోచిస్తూ ఇక తాము కెరీర్‌లో రాణించలేమనుకుంటారు. ఇతరులతో పోల్చుకుంటూ తీవ్ర ఒత్తిడిలోకి కూరుకుపోతుంటారు. నిజానికి ఇలాంటి ప్రతికూల భావాలే కెరీర్ తిరోగమనానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. అందుకే వైఫల్యాల్ని కూడా సానుకూలంగా స్వీకరించి.. వాటి నుంచి కొత్త పాఠాలు నేర్చుకోగలిగితే కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టుకోవచ్చంటున్నారు. మరి, కెరీర్‌లో విఫలమయ్యామని ఎప్పుడనిపిస్తుంది? దానిని అధిగమించి ముందుకు సాగడమెలాగో తెలుసుకుందాం రండి..
ఇవే కారణమా?
* ఏ పని చేయాలన్నా ప్రణాళిక ముఖ్యం. కెరీర్‌లో విజయవంతంగా ముందుకెళ్లాలన్నా ప్లానింగ్ తప్పనిసరి! అయితే కొంతమంది దీన్ని విస్మరిస్తుంటారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా చేతికొచ్చిన పనిని చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. దీనివల్ల ఎంత పనిచేసినా సంతృప్తి కలగదు.. సరికదా కెరీర్‌లో ఆశించిన స్థాయిలో వృద్ధి లేక ఒకానొక సమయంలో విఫలమయ్యామన్న వైరాగ్య భావన ఆవహిస్తుంది.
* కొంతమంది కెరీర్‌లో అయినా, జీవితంలోనైనా సాధ్యం కాని లక్ష్యాల్ని నిర్దేశించుకుంటారు. వాటిని చేరుకునే క్రమంలో ఎంతో శ్రమ పడతారు.. కానీ ఆశించిన ఫలితం దక్కదు. ఇలాంటప్పుడు ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఇది క్రమంగా విఫలమయ్యామన్న భావన కలిగేలా చేస్తుంది.

* చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్క.. తాత్కాలికంగా ఏదో ఒక ఉద్యోగంలో చేరుతుంటారు కొందరు. ఇటు ఈ ఉద్యోగం చేస్తూనే.. తాము కోరుకున్న కెరీర్‌పై దృష్టి పెడుతుంటారు. ఒకవేళ ఆశించిన ఉద్యోగం లభించకపోతే ఒక రకమైన అసహనానికి, కెరీర్ విఫలమైందన్న భావనకూ లోనవుతుంటారు.
* ఉద్యోగంలో ఎవరి సామర్థ్యాలు వారివి! ఒకరికి అప్పగించిన పనిని వేగంగా పూర్తి చేయగలిగే సామర్థ్యముండచ్చు.. మరొకరికి ఎన్ని పనులైనా ఒంటి చేత్తో నిర్వహించే సత్తా ఉండచ్చు.. ఇంకొకరికి టెక్నాలజీపై పట్టుండచ్చు.. అయినా కొంతమంది తమ సామర్థ్యాల్ని పక్కన పెట్టి ఇతరులతో పోల్చుకుంటుంటారు. ఇది కూడా తాము కెరీర్‌లో విఫలమయ్యామన్న భావనను కలిగిస్తుందంటున్నారు నిపుణులు.
* కెరీర్‌ని విజయవంతంగా కొనసాగించాలంటే ఆరోగ్యం కూడా అందుకు సహకరించాలి. అయితే కొంతమందిలో పలు శారీరక సమస్యలుండచ్చు.. మరికొంతమందికి వ్యక్తిగత/వృత్తిపరమైన కారణాల వల్ల మానసిక సమస్యలు ఎదురుకావచ్చు. ఇలాంటి సమయంలో చేసే పనిపై పూర్తి దృష్టి పెట్టలేం. దాంతో అటు కెరీర్‌లో వృద్ధి, ఇటు వ్యక్తిగత జీవితంలో సంతృప్తి లేవన్న భావన వెంటాడుతుంది.
* కొంతమంది కెరీర్‌లో పూర్తి చేయాల్సిన లక్ష్యాల్ని పకడ్బందీగా నిర్దేశించుకుంటారు. కానీ వాటిని ఆచరణలో పెట్టే విషయంలో జాప్యం చేస్తుంటారు. పనుల్ని పూర్తిచేసే విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. దీనివల్ల కూడా లక్ష్యాల్ని సరైన సమయంలో చేరుకోలేక.. విఫలమయ్యామన్న భావన దరిచేరుతుందంటున్నారు నిపుణులు.
* వృత్తిఉద్యోగాల్లో మనం ఎంత చురుగ్గా వ్యవహరించినా.. మన చుట్టూ ఉన్న కొందరు మనల్ని వెనక్కి లాగాలని చూస్తుంటారు. విమర్శలు, నెగెటివ్ మాటలతో మనలో ప్రతికూల భావనలు కలిగేలా చేస్తారు. ఇలాంటి వ్యక్తులకు ప్రభావితమైనా కెరీర్‌లో ఏమీ సాధించలేకపోతున్నామన్న భావన కలగడం సహజం.
* కొంతమంది విషయంలో కెరీర్ ప్రణాళిక అంతా బాగానే ఉంటుంది.. కానీ ఆయా పనులు పూర్తిచేయడానికి సంబంధించిన ఉత్సాహం కొరవడుతుంది. దీనివల్ల కూడా పనులు అనుకున్న సమయానికి పూర్తికాక.. కెరీర్ విఫలమైందన్న ఒక రకమైన అసహనం దరిచేరుతుంది.

అధిగమిస్తేనే అందలం!
* జీవితంలోనైనా, కెరీర్ పరంగానైనా.. తమకెదురైన వైఫల్యాల్ని చాలామంది స్వీకరించరు. తమకే ఎందుకిలా? అన్న ప్రతికూల భావనలోకి కూరుకుపోతారు. కానీ ఇలా ఆలోచించడం కంటే.. ‘జరిగిందేదో జరిగిపోయింది.. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్తపడాల’న్న సానుకూల దృక్పథంతో ముందుకు సాగినప్పుడే.. కెరీర్ వృద్ధి సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు.
* ‘ఓటమి గెలుపుకి తొలి మెట్టు’ అంటారు. అంటే.. ఓటమికి గల కారణాల్ని పసిగట్టి.. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూనే.. అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తపడినప్పుడే కెరీర్ వైఫల్యాల్ని సులభంగా అధిగమించచ్చంటున్నారు నిపుణులు.
* ‘నా పనేదో నాది.. ఇతరులతో సంబంధం లేదన్న’ట్లుగా పని ప్రదేశంలో కొంతమంది రిజర్వ్‌డ్‌గా వ్యవహరిస్తుంటారు. కెరీర్‌లో వెనకబడినప్పుడు ఇలాంటి వారికి తోటి వారి నుంచి ఎలాంటి సహాయం అందదు. కాబట్టి వృత్తిఉద్యోగాల్లో తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, ఇతర సంస్థల్లో పనిచేసే స్నేహితులతో స్నేహబంధం కొనసాగించడం వల్ల.. కెరీర్‌లో ఎదురయ్యే సమస్యల్ని అధిగమించడం సులభమవుతుందంటున్నారు నిపుణులు.
* ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్న ఎంతోమంది తమ కెరీర్ మొదట్లో వైఫల్యాలను ఎదుర్కొన్న వారే! కాబట్టి వాళ్ల స్ఫూర్తి గాథల గురించి తెలుసుకుంటే ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతికూలతల్ని ఎలా అధిగమించాలో కూడా వాళ్ల నుంచి నేర్చుకోవచ్చు.
* వైఫల్యాలు ఎదురయ్యాయని వాటినే తలచుకుంటే అక్కడే ఆగిపోతాం. అదే ఆ ప్రతికూల ఆలోచనల్ని అధిగమించి.. ఆసక్తి ఉన్న అంశాలపై దృష్టి పెడితే.. కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాం.. ఇదీ పరోక్షంగా మన కెరీర్‌కి ప్లస్ అవుతుంది.
* ఎంత నేర్చుకున్నా, ఎన్ని నైపుణ్యాల్లో పట్టు సాధించినా నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే మన కెరీర్ అవకాశాల్ని విస్తరించుకోగలుగుతాం. అందుకే వైఫల్యాల్ని పక్కన పెట్టి మీ చదువుకు తగ్గ ఇతర కెరీర్ అవకాశాలపై దృష్టి పెట్టమంటున్నారు నిపుణులు. దీనివల్ల ఇటు కెరీర్ అభివృద్ధి సాధించచ్చు.. అటు ఆర్థికంగానూ మరింత దృఢం కావచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
    
    
    బ్యూటీ & ఫ్యాషన్
- చర్మం రిపేర్ చేశారా?
 - నిపుల్ హెయిర్ పోవాలంటే..
 - మొటిమల సమస్యకు.. కలబంద!
 - చర్మం ముడతలు పడుతోందా?
 - అందం... అలంకరణ రెండూనూ!
 
ఆరోగ్యమస్తు
- చక్కగా నిద్ర పట్టాలంటే..!
 - పది నిమిషాలు ఇలా చేస్తే.. ఫిట్‌గా మారిపోవచ్చుట!
 - ‘మఖానా’.. పోషకాల ఖజానా!
 - అభయ ముద్ర
 - తింటున్నా... నీరసమే!
 
అనుబంధం
- పిల్లల ముందు ఇలా చేయకూడదట!
 - ఆ రెండింటి సమన్వయానికీ..!
 - బంధం ప్రమాదకరంగా మారుతోందా..?
 - మీరు ‘మైండ్‌ఫుల్’ తల్లిదండ్రులేనా..!
 - అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారా?
 
యూత్ కార్నర్
- హ్యాట్సాఫ్... అమ్మాయిలూ
 - Shafali Verma: అందుకే అప్పుడు అబ్బాయిలా వేషం మార్చుకున్నా..!
 - జెన్ జీ అమ్మాయిలు మరచిపోతున్నారా..!
 - మీరే ఒక సైన్యం!
 - ప్రపంచ వేదికపై ప్రకృతి ప్రతినిధి!
 
'స్వీట్' హోం
- చిమ్నీలు వాడుతున్నారా?
 - ఒత్తిడిని తగ్గించే ఫిష్ ట్యాంక్లివి..!
 - వెన్నతో.. ఇలా కూడా!
 - ఉసిరి దీపానికి స్టాండ్!
 - అందాల ఆలమండా!
 
వర్క్ & లైఫ్
- బాగా పని చేయాలంటే..!
 - అమ్మాయిలూ... ధైర్యమే మీ పెట్టుబడి!
 - అపరాధ భావంతో బాధపడుతున్నారా?
 - పొగిడితే ఆనందం!
 - బ్లూమ్ స్క్రోలింగ్ చేద్దామా..!
 































            








