ఏమా కళ్లు... వాహ్ ఆ నవ్వు..!
ఆ కళ్లు చూడు... నాతో ఏవేవో ఊసులు చెబుతుంటాయి. తను నవ్వుతోంటే ముత్యాలు రాలుతున్నట్టే అనిపిస్తుంది.

ఆ కళ్లు చూడు... నాతో ఏవేవో ఊసులు చెబుతుంటాయి. తను నవ్వుతోంటే ముత్యాలు రాలుతున్నట్టే అనిపిస్తుంది. ఆ నవ్వుకే నేను ఫిదా! నచ్చిన అమ్మాయి విషయంలో అబ్బాయిల నుంచి వచ్చే పొగడ్తలే ఇవి కదూ! కేవలం సిగ్గు మొగ్గలేసే కళ్లని చూసి, గాజుల గలగలకు మనసు పారేసుకున్నానని చెప్పే కథలూ బోలెడు.
మరి ఆ మాటే నచ్చిందో... పొగడ్తకే పడిపోయారో కానీ... ఈమధ్య కళ్లు, చిరునవ్వు, ఒక పక్క ముఖం, గాజులతో నిండిన చేతులు, గజ్జెలున్న పాదాలు... ఇలా ఒక్కోదాన్నీ హైలెట్ చేస్తూ ఫొటోలు తీసుకుంటున్నారు అమ్మాయిలు. ఆపై వాటిని కొలేజ్‌గా మార్చి పంచుకుంటున్నారు. సెలెక్టివ్ ఫోకస్, క్రాప్‌డ్ పోర్ట్రెయిట్, మాక్రో ఫొటోగ్రఫీ అంటూ సోషల్‌మీడియాలో ట్రెండ్‌నీ చేస్తున్నారు. ఇక ఆ తరవాత చూడాలి... వాటిని పొగుడుతూ ఎన్ని కామెంట్లో. ఇంకేం తమ ముఖంలో వాళ్లు మెచ్చే భాగాన్ని మరింత అందంగా సృజనాత్మకతను జోడించి మరీ ఫొటోల్లో బంధించేస్తున్నారు. ఇది సరదా విషయమే కాదు, దీనిలో కొంత జాగ్రత్త కూడా ఉంది. తీసుకున్న ఫొటో నలుగురితో పంచుకోవాలని చాలామంది కోరుకునేదే! అయితే అవి ఏ దురుద్దేశం ఉన్నవారి చేతుల్లో పడుతున్నాయో అనే భయం. అలాగని సోషల్‌మీడియాకి దూరంగా ఉండలేరు. అలా భావించే అమ్మాయిలూ ఈ ట్రెండ్‌లో భాగమవుతున్నారు. అంతేకాదు... నీ కళ్లు కాస్త చిన్న. నీ పళ్లేంటి అలా ఉన్నాయి... హుష్... ఎలాగున్నా ఎన్నెన్ని వంకలు. ఎంత పట్టించుకోవద్దు అనుకున్నా మనసులో ఏ మూలో గాయపరచకుండా ఉంటాయా? అందుకని వెక్కిరించకుండా కూడా ఇలా ప్రయత్నిస్తున్నారట. పోనీ అలాకాకపోయినా తమలో తామే వంకలు వెతుక్కునే అమ్మాయిలూ ఎక్కువే. అలాంటివాళ్లు అరె ఇలా ఉన్నానే అని బాధపడకుండా తమలోని స్ట్రాంగ్ పాయింట్ ఏంటా అని వెతుక్కుంటున్నారట. వాటినే చూపిస్తూ కితాబులు అందుకుంటున్నారు. ఎవరి కారణమేదైనా ఈ సెలెక్టివ్ ఫోకస్, క్రాప్‌డ్ పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీ అమ్మాయిలను మెప్పించిందన్నది వాస్తవం. కాబట్టే, తెగ అనుసరించేస్తున్నారు. మరి మీ సంగతేంటి? మీకూ నచ్చిందా? చెడు కామెంట్లు, ఫొటో ఎవరి చేతిలో పడుతుందన్న భయం లేదు. పైగా వాహ్ అనిపించే పొగడ్తలు అదనం. ఇంకేం ప్రయత్నించండి మరి.






Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
    
    
    బ్యూటీ & ఫ్యాషన్
- చర్మం రిపేర్ చేశారా?
 - నిపుల్ హెయిర్ పోవాలంటే..
 - మొటిమల సమస్యకు.. కలబంద!
 - చర్మం ముడతలు పడుతోందా?
 - అందం... అలంకరణ రెండూనూ!
 
ఆరోగ్యమస్తు
- చక్కగా నిద్ర పట్టాలంటే..!
 - పది నిమిషాలు ఇలా చేస్తే.. ఫిట్‌గా మారిపోవచ్చుట!
 - ‘మఖానా’.. పోషకాల ఖజానా!
 - అభయ ముద్ర
 - తింటున్నా... నీరసమే!
 
అనుబంధం
- పిల్లల ముందు ఇలా చేయకూడదట!
 - ఆ రెండింటి సమన్వయానికీ..!
 - బంధం ప్రమాదకరంగా మారుతోందా..?
 - మీరు ‘మైండ్‌ఫుల్’ తల్లిదండ్రులేనా..!
 - అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారా?
 
యూత్ కార్నర్
- హ్యాట్సాఫ్... అమ్మాయిలూ
 - Shafali Verma: అందుకే అప్పుడు అబ్బాయిలా వేషం మార్చుకున్నా..!
 - జెన్ జీ అమ్మాయిలు మరచిపోతున్నారా..!
 - మీరే ఒక సైన్యం!
 - 22ఏళ్ల అమ్మాయి... 100 మందికి అమ్మయ్యింది!
 
'స్వీట్' హోం
- చిమ్నీలు వాడుతున్నారా?
 - ఒత్తిడిని తగ్గించే ఫిష్ ట్యాంక్లివి..!
 - వెన్నతో.. ఇలా కూడా!
 - ఉసిరి దీపానికి స్టాండ్!
 - అందాల ఆలమండా!
 
వర్క్ & లైఫ్
- బాగా పని చేయాలంటే..!
 - అమ్మాయిలూ... ధైర్యమే మీ పెట్టుబడి!
 - అపరాధ భావంతో బాధపడుతున్నారా?
 - పొగిడితే ఆనందం!
 - బ్లూమ్ స్క్రోలింగ్ చేద్దామా..!
 































            








