అందానికీ క్యారట్..!
చర్మం బాగుండాలంటే విటమిన్-ఎ కూడా తగినంత పరిమాణంలో శరీరానికి అందాలి. ఈ క్రమంలో క్యారట్‌లో ఉండే విటమిన్ 'ఎ' చర్మం బిగుతుదనం కోల్పోకుండా చేసి యవ్వనంగా ఉండేలా చేయడంలో తోడ్పడుతుంది. ఇందుకోసం క్యారట్‌తో తయారుచేసుకునే ఈ ఫేస్ ప్యాక్, స్క్రబ్ ఉపయోగపడతాయి అని చెబుతున్నారు నిపుణులు.

చర్మం బాగుండాలంటే విటమిన్-ఎ కూడా తగినంత పరిమాణంలో శరీరానికి అందాలి. ఈ క్రమంలో క్యారట్‌లో ఉండే విటమిన్ 'ఎ' చర్మం బిగుతుదనం కోల్పోకుండా చేసి యవ్వనంగా ఉండేలా చేయడంలో తోడ్పడుతుంది. ఇందుకోసం క్యారట్‌తో తయారుచేసుకునే ఈ ఫేస్ ప్యాక్, స్క్రబ్ ఉపయోగపడతాయి అని చెబుతున్నారు నిపుణులు.
ఫేస్ ప్యాక్
కావాల్సినవి:
⚛ క్యారట్ జ్యూస్- 1 టేబుల్‌స్పూన్
⚛ గుడ్డు- 1
⚛ ఆలివ్ ఆయిల్- 1 టీస్పూన్
⚛ పెరుగు- టేబుల్‌స్పూన్
తయారీ
ముందుగా క్యారట్‌ని గ్రైండ్ చేసి జ్యూస్ తీసుకోవాలి. ఈ జ్యూస్ ఒక టేబుల్‌స్పూన్ తీసుకొని దానికి గుడ్డులోని తెల్లసొన జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి పెరుగు కలిపి మరోసారి మెత్తగా అయ్యేవరకు మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులో ఆలివ్ ఆయిల్ కూడా కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలా మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి అప్త్లె చేసుకుని 25 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
మృతకణాలు తొలగించే.. స్క్రబ్!
క్యారట్‌తో స్క్రబ్ తయారు చేసుకోవడం చాలా సులభం. దీనివల్ల ప్రయోజనాలు కూడా ఎక్కువే. పైగా ఖర్చు కూడా తక్కువ అంటున్నారు నిపుణులు.
కావాల్సినవి:
⚛ క్యారట్- 1
⚛ పంచదార- 1 టేబుల్‌స్పూన్
⚛ పాల పొడి- 1 టేబుల్‌స్పూన్
తయారీ:
క్యారట్‌ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలకి పాలపొడి, పంచదార జత చేయాలి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. మనకి కావాల్సింది స్క్రబ్ కాబట్టి మిశ్రమం మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా ఉండేలా చూసుకోవాలి. ఈ మిశ్రమంతో ముఖంపై మృదువుగా మర్దనా చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖంపై 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇప్పుడు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. స్క్రబ్ చేయడం వల్ల చర్మం మీద పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి కాబట్టి చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది. అంతేకాకుండా బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ కూడా తగ్గుముఖం పడతాయి అంటున్నారు నిపుణులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
    
    
    బ్యూటీ & ఫ్యాషన్
- చర్మం రిపేర్ చేశారా?
 - నిపుల్ హెయిర్ పోవాలంటే..
 - మొటిమల సమస్యకు.. కలబంద!
 - చర్మం ముడతలు పడుతోందా?
 - అందం... అలంకరణ రెండూనూ!
 
ఆరోగ్యమస్తు
- చక్కగా నిద్ర పట్టాలంటే..!
 - పది నిమిషాలు ఇలా చేస్తే.. ఫిట్‌గా మారిపోవచ్చుట!
 - ‘మఖానా’.. పోషకాల ఖజానా!
 - అభయ ముద్ర
 - తింటున్నా... నీరసమే!
 
అనుబంధం
- పిల్లల ముందు ఇలా చేయకూడదట!
 - ఆ రెండింటి సమన్వయానికీ..!
 - బంధం ప్రమాదకరంగా మారుతోందా..?
 - మీరు ‘మైండ్‌ఫుల్’ తల్లిదండ్రులేనా..!
 - అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారా?
 
యూత్ కార్నర్
- హ్యాట్సాఫ్... అమ్మాయిలూ
 - Shafali Verma: అందుకే అప్పుడు అబ్బాయిలా వేషం మార్చుకున్నా..!
 - జెన్ జీ అమ్మాయిలు మరచిపోతున్నారా..!
 - మీరే ఒక సైన్యం!
 - 22ఏళ్ల అమ్మాయి... 100 మందికి అమ్మయ్యింది!
 
'స్వీట్' హోం
- చిమ్నీలు వాడుతున్నారా?
 - ఒత్తిడిని తగ్గించే ఫిష్ ట్యాంక్లివి..!
 - వెన్నతో.. ఇలా కూడా!
 - ఉసిరి దీపానికి స్టాండ్!
 - అందాల ఆలమండా!
 
వర్క్ & లైఫ్
- బాగా పని చేయాలంటే..!
 - అమ్మాయిలూ... ధైర్యమే మీ పెట్టుబడి!
 - అపరాధ భావంతో బాధపడుతున్నారా?
 - పొగిడితే ఆనందం!
 - బ్లూమ్ స్క్రోలింగ్ చేద్దామా..!
 































            








