కాబోయే అమ్మలకు బహుమతిగా..
close
Published : 08/11/2021 20:32 IST

కాబోయే అమ్మలకు బహుమతిగా..

ప్రతి మహిళకు ప్రెగ్నెన్సీ అనేది ఎంతో ప్రత్యేకమైనది. తనకు మాత్రమే కాదు చుట్టూ ఉండే బంధువులు, స్నేహితులు కూడా ఆ శుభవార్తను విని ఆనందిస్తుంటారు. పాప/బాబుకి జన్మనిచ్చి వారి ఎదుగుదలను చూడాలని ప్రతి మహిళ కలలు కంటుంది. ఆ శుభ సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ దానిని సెలబ్రేట్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సందర్భంలో మంచి బహుమతి ఇవ్వాలని చాలామంది అనుకుంటారు. కానీ చాలామంది చీర, గాజులతో సరిపెట్టేస్తుంటారు. ఈ క్రమంలో ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి బహుమతులు ఇవ్వచ్చో తెలుసుకుందాం రండి...

ప్రెగ్నెన్సీ పిల్లో..

గర్భం ధరించిన తర్వాత కొంతమంది మహిళలు వెన్నునొప్పి సమస్యతో బాధపడుతుంటారు. ఈ నొప్పి వల్ల వారికి నిద్ర పోయేటప్పుడు కూడా అసౌకర్యంగా ఉంటుంది. ఇలాంటివారి కోసం మార్కెట్లో ప్రెగ్నెన్సీ పిల్లోలు అందుబాటులోకి వచ్చాయి. ప్రెగ్నెన్సీ సమయంలో దీనిని బహుమతిగా ఇవ్వచ్చు. ఈ పిల్లోని ఉపయోగించడం వల్ల పడుకునేటప్పుడు కాళ్లపై పడే ఒత్తిడి కూడా తగ్గుతుంది.

యోగా బాల్..

గర్భం ధరించినప్పుడు సైతం వాకింగ్‌, వర్కౌట్లు చేయమని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే కొంతమంది మూడ్‌ స్వింగ్స్‌, శారీరక మార్పుల వల్ల వ్యాయామం చేయడానికి ఇష్టపడరు. ఈ సమయంలో శారీరక వ్యాయామం అవసరం తెలిసిన కొంతమంది మాత్రం యోగా వంటివి చేస్తుంటారు. ఇలాంటివారికి యోగా బాల్‌ బాహుమతిగా ఇవ్వచ్చు. దీని ద్వారా యోగా చేయడం సులభమవుతుంది. ఇది కేవలం ప్రెగ్నెన్సీ సమయంలోనే కాకుండా డెలివరీ తర్వాత కూడా ఉపయోగపడుతుంది.

స్ట్రెచ్‌మార్క్స్‌ కోసం...

మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య స్ట్రెచ్‌మార్క్స్. ఈ సమస్య గర్భధారణ నుంచే మొదలవుతుంటుంది. ఈ సమయంలో చర్మం సాగి వదులుగా అవడం వల్ల చర్మంపై చారలు ఏర్పడుతుంటాయి. కొంతమందికి పెరిగిన బరువు తగ్గినప్పుడు, పని ఒత్తిడి వల్ల కూడా చర్మం సాగి స్ట్రెచ్‌మార్క్స్‌ వస్తుంటాయి. దీనికోసం మార్కెట్లోకి ఎన్నో రకాల క్రీంలు అందుబాటులోకి వచ్చాయి. సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడే ఇలాంటి క్రీంలు ఉపయోగించడం వల్ల స్ట్రెచ్‌మార్క్స్‌ సమస్యను చాలావరకు తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇలాంటి క్రీంలను మీ బెస్టీకి గిఫ్ట్‌గా ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఎలాంటి క్రీమ్స్ మంచివన్న విషయాన్ని మాత్రం వైద్యులను అడిగి తెలుసుకోవడం మంచిది.

నాసియా బ్యాండ్..

కొంతమంది మహిళలు గర్భం ధరించిన మొదటి త్రైమాసికంలో వాంతులు, వికారం.. వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. దీనికి పరిష్కార మార్గంగా నాసియా రిస్ట్‌ బ్యాండ్‌ను బహుమతిగా ఇవ్వచ్చు. వాంతులు, వికారంగా ఉన్నప్పుడు ఉపశమనం కోసం పెద్దవాళ్లు మణికట్టు దగ్గర బొటనవేలుతో నొక్కడం చూసే ఉంటాం. ఈ నాసియా రిస్ట్‌ బ్యాండ్‌ కూడా అదే పని చేస్తుంది. ఈ బ్యాండ్‌ మధ్యలో ఆక్యుప్రెజర్‌ పాయింటర్‌ ఉంటుంది. ఈ పాయింటర్‌ మణికట్టు దగ్గర ఉండే నాడులపై ఒత్తిడి కలిగించి, తద్వారా కొంత ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఈ బ్యాండ్‌ పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని