మీరూ ఇలాంటి అమ్మాయేనా?

కొంతమంది అమ్మాయిలు తమలో ఆత్మవిశ్వాసం లోపించిందని.. ఫలితంగా తామేమీ సాధించలేకపోతున్నామని.. ఏ పని చేయాలన్నా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని బాధపడుతుంటారు. అలాంటి వారు ఆత్మవిశ్వాసం మెండుగా ఉండే వారిలో ఎలాంటి లక్షణాలుంటాయో తెలుసుకోగలిగితే.. వారి నుంచి స్ఫూర్తి పొందచ్చని చెబుతున్నారు నిపుణులు.

Eenadu icon
By Vasundhara Team Published : 07 Aug 2025 21:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

కొంతమంది అమ్మాయిలు తమలో ఆత్మవిశ్వాసం లోపించిందని.. ఫలితంగా తామేమీ సాధించలేకపోతున్నామని.. ఏ పని చేయాలన్నా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని బాధపడుతుంటారు. అలాంటి వారు ఆత్మవిశ్వాసం మెండుగా ఉండే వారిలో ఎలాంటి లక్షణాలుంటాయో తెలుసుకోగలిగితే.. వారి నుంచి స్ఫూర్తి పొందచ్చని చెబుతున్నారు నిపుణులు.

సొంతంగా నిర్ణయాలు..

అమ్మాయిలు ఏం చదవాలి.. ఎక్కడ చదవాలి.. ఎలాంటి ఉద్యోగం చేయాలి.. మొదలైన అంశాల్లో కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ తుది నిర్ణయం పెద్దలదే అవుతుంటుంది. వారిది చిన్న వయసు కావడం వల్ల వారికేమీ తెలీదనే భావన కూడా ఇందుకు ఓ కారణం కావచ్చు. అయితే ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిల్లో తాము ఏం చేయాలో వారే నిర్ణయం తీసుకొనే సామర్థ్యం ఉంటుందట. అలాగని ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వరని కాదు. ఎదుటివారి భావాలను గౌరవిస్తూనే.. తమ వాణిని బలంగా వినిపించే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే తాము తీసుకొన్న నిర్ణయం సరైనదేనా? కాదా? అని ఆలోచించుకోవడంతో పాటు.. దానివల్ల జరిగే మంచిచెడులను కచ్చితంగా బేరీజు వేసుకోగలుగుతారు. ఫలితంగా తమ లక్ష్యం వైపు ప్రోత్సహించేలా కుటుంబ సభ్యులు, స్నేహితులనూ వీరు ఒప్పించగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.

‘నో’ చెప్పడం తెలుసు..!

ఎవరైనా మనకు ఏదైనా పని అప్పగించినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇష్టం లేకపోయినా.. మొహమాటానికి పోయి ఆ పనిని పూర్తి చేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో మేం ఈ పని చేయలేమని ధైర్యంగా చెప్పలేకపోతాం. కానీ ఆత్మవిశ్వాసం మెండుగా ఉండే ఈ తరం అమ్మాయిలు తమకు నచ్చని పనులు ‘చెయ్యం’ అని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడరట! అలాగే ఆ పనిని తాము ఎందుకు చేయమంటున్నారో దానికి గల కారణాలను సైతం వారు చెప్పడానికి మొహమాటపడరట!

అసూయ ఉండదు..

ఇతరులు తమకంటే కొన్ని విషయాల్లో మెరుగ్గా ఉన్నా లేదా వారు చేస్తున్న పనిలో విజయం సాధించినా వారిని చూసి అసూయపడే వారు చాలామందే ఉంటారు. కానీ ఆత్మవిశ్వాసం ఉన్న వారు ఇతరులను చూసి ఇలా అసూయపడరట. తమ పనేదో తాము చూసుకొని ముందుకు సాగుతుంటారే తప్ప.. ఇతరుల గురించి ప్రతిదీ పట్టించుకోవాలన్న ఆసక్తి వారికుండదు. ఫలితంగా తాము చేస్తున్న పని పైనే పూర్తి శ్రద్ధ పెట్టి, సాధించాలనుకొన్న లక్ష్యాల్ని చేరుకోగలుగుతారు. అంతేకాదు.. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడానికీ వీరు వెనకాడరట. అలాగే ఇతరులను ప్రోత్సహించడంలోనూ వీరు ముందుంటారు అంటున్నారు నిపుణులు. మరి మీరూ అంతేనా?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్