పరీక్షే తప్పారు... జీవితాన్ని కాదు
ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్న అమ్మాయి... పరీక్షల్లో తాను అనుకున్న ఫలితం రాలేదని బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థిని... పరీక్ష తప్పుతానన్న భయంతో పురుగుల మందు తాగిన బాలిక... వీటన్నింటికీ కారణం మానసిక ఒత్తిడే.

ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్న అమ్మాయి... పరీక్షల్లో తాను అనుకున్న ఫలితం రాలేదని బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థిని... పరీక్ష తప్పుతానన్న భయంతో పురుగుల మందు తాగిన బాలిక... వీటన్నింటికీ కారణం మానసిక ఒత్తిడే. దాన్నుంచి బయటపడాలంటే...
తెలుగు రాష్ట్రాల్లో పది, ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంచి మార్కుల్ని సాధించిన విద్యార్థులు ఆనందంలో మునిగితేలుతుంటే... కొందరు అనుకున్న ఫలితాల్ని అందుకోలేకపోయామంటూ బాధపడుతున్నారు. ఫెయిల్ అయ్యి ఇంకొందరు తల్లిదండ్రులు, సమాజం నుంచి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనంతటికీ కారణం మానసిక ఒత్తిడే. ‘ఫెయిల్ అయిన వాళ్లు దేనికీ పనికిరారు’ అన్నట్లు చూస్తోంది సమాజం. దాన్నుంచి బయట పడలేక... ఆ ఒత్తిడిని తట్టుకోలేక... విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒక పరీక్షా ఫలితం జీవితాన్ని నిర్ణయిస్తుందా... అలా అయితే ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఉన్న వారంతా టాప్ ర్యాంకర్లేనా... చరిత్రపుటలను తిరగేస్తే, సగానికిపైగా చదువులో ఎప్పుడో ఒకసారి వెనకబడిన వారే. విద్యుత్ బల్బ్‌ను కనిపెట్టి... ప్రపంచానికే వెలుగు అందించిన థామస్ ఎడిసన్‌ని బుద్ధిమాంద్యం కారణంతో చిన్నప్పుడే స్కూల్ నుంచి పంపేశారు. తల్లి సహాయంతో ఇంట్లోనే చదువుకున్నారాయన. కమ్యూనికేషన్స్, గణితం సబ్జెక్టుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి వ్యాపార రంగంలో చెరగని ముద్ర వేశారు. జీవితంలో ఎదగడానికి మార్కులే కొలమానం అయితే వీళ్లూ ఫెయిల్ అయిన వాళ్లే. మరి ఉన్నత స్థానాల్ని ఎలా అధిరోహించగలిగారు? వీరంతా విజయాన్ని సొంతం చేసుకోవడానికి అవకాశాల కోసం వెతికారు. ఆ ఒక్క ఛాన్స్ మీకూ వస్తుంది. కాకపోతే దానికోసం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఈ క్రమంలో ఎదురయ్యే జయాపజయాలు మనకు పాఠాలు మాత్రమే... అవే జీవితం కాదన్న విషయాన్ని గమనించుకోవాలి.
ఒక్కక్షణం...
‘పక్కింటి అమ్మాయిని చూడు ఎంత మంచి మార్కులు వచ్చాయో. తను కూడా నీతోటిదే కదా. నువ్వెందుకు వెనకబడ్డావు’ అంటూ చెడా మడా తిట్టింది ఓ తల్లి. కాసేపటికి తన ప్రవర్తనకు బాధపడి కూతురి గదిలోకి వెళ్లి చూస్తే, ఆ పిల్ల శవమై తేలింది... ఇది తల్లిదండ్రుల్లో అవగాహనకు సోషల్ మీడియాలో చేసిన ఓ వీడియో. నిజ జీవితంలోనూ ఇలాంటి సంఘటనలెన్నో. పరిస్థితులు చేజారిపోయాక బాధపడిన తల్లిదండ్రులెందరో. అందుకే మనం చెప్పే విషయమేదైనా వాళ్లలో పోటీతత్వాన్నీ, మార్గానిర్దేశాన్నీ సూచించేవిగా ఉండాలే గానీ చిన్నారి జీవితాన్ని చిదిమేసేలా ఉండకూడదు.
అది పాఠమే...
సింహం వేటాడే సమయంలో ఏ జింకో కనిపించగానే... ఒక్క అడుగు వెనక్కి వేసి, మరింత వేగంతో ముందుకు దూకి దానిపై దాడిచేస్తుంది. పరీక్షల్లో మీకు ఎదురయ్యే అపజయం కూడా అలాంటిదే. మీరు ఒక అడుగు వెనక్కి వేశారంటే... అది మీకు పాఠం అవుతుందే తప్ప, వైఫల్యం కాదు. మీ కెరియర్‌కు అది మచ్చా కాదు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్నప్పుడే జీవితం, కెరియర్ మీద మరింత అవగాహన పెరిగేది. కాబట్టి ఫెయిల్యూర్స్ చూసి భయపడకండి. ఆత్మన్యూనతతో మీరు చేసే పొరపాటు మీ తల్లిదండ్రులకు వేసే అతిపెద్ద శిక్ష అని మరచిపోకండి.
సాయం తీసుకోండి
సాయం అడగడం బలహీనత కాదు. ఆందోళనలో మీరున్నప్పుడు... ఈ కింది నంబర్లకు ఫోన్ చేయండి.
టెలీ-మానస్: అకడమిక్, పోటీ పరీక్షలు, ర్యాగింగ్, కుల వివక్ష లాంటి కారణాలతో ఒత్తిడికి గురవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి పనిచేస్తోన్న కార్యక్రమం ఇది. 14416, 18008914416 హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయండి. క్లినికల్ సైకాలజిస్టులు, సామాజిక కార్యకర్తలు అందుబాటులోకి వచ్చి, మీ సమస్య వినడమే కాదు. అవసరమైన మార్గనిర్దేశమూ చేస్తారు.
వన్‌లైఫ్...7893078930, జీవన్ ఆస్తా...18002333330, స్నేహా సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్‌లైన్... 04424640050, ఆసరా...9820466726 లాంటి చాలా ఎన్జీవోలు మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు పరిష్కారాన్ని చూపిస్తున్నాయి.
అభద్రతా భావం వద్దు...
మంచి మార్కులు, అంచనాలు, బెదిరింపులు, తోటి వారితో పోలిక లాంటి రకరకాల కారణాలతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్ష రాశాక కూడా ఈ ఆలోచనలే వాళ్లను వెంటాడుతున్నాయి. అవే డిప్రెషన్‌కు కారణమై... ఆత్మహత్యలకూ దారితీస్తున్నాయి. ఈ విషయంలో పేరెంట్స్, పిల్లలూ ఇద్దరికీ కౌన్సెలింగ్ అవసరం. పరీక్షల్లో ఒకవేళ ఫెయిల్ అయినా, ఇదేం పెద్ద సమస్య కాదని, ఈసారి బాగా కష్టపడి మంచిమార్కులు తెచ్చుకోవచ్చని ధైర్యం చెప్పండి. పిల్లల హావభావాల్లో వచ్చే మార్పుల్ని గమనిస్తూ... అవి ఎక్కువైతే వెంటనే సైకాలజిస్టుల్ని సంప్రదించండి.

- డా. మండాది గౌరీదేవీ
మానసిక నిపుణురాలు
మీకు తెలుసా?

తల్లి కడుపులో శిశువు ప్రాణం పోసుకోవడం ఓ అద్భుతం. అయితే, గర్భస్థ శిశువుకి మొదట డెవలప్ అయ్యే సెన్స్... స్పర్శ అట. బిడ్డ కడుపులో పడ్డ 8 వారాలకే ఇది అభివృద్ధి చెందుతుందట. ముందుగా నోరు, ముఖంలో ఈ సెన్స్ డెవలప్ అయ్యి, తరవాత మిగతా శరీర భాగాల్లో జరుగుతుందట.

నాయకత్వం అంటే అన్ని ప్రశ్నలకూ మన దగ్గర సమాధానాలు ఉండటం కాదు. సరైన ప్రశ్నల్ని లేవనెత్తడం, వాటికి మెరుగైన పరిష్కారాలు చూపేలా బృందాన్ని తీర్చిదిద్దడం.
స్మితా జాటియా, వైస్ ఛైర్‌పర్సన్, వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
    
    
    బ్యూటీ & ఫ్యాషన్
- చర్మం రిపేర్ చేశారా?
 - నిపుల్ హెయిర్ పోవాలంటే..
 - మొటిమల సమస్యకు.. కలబంద!
 - చర్మం ముడతలు పడుతోందా?
 - అందం... అలంకరణ రెండూనూ!
 
ఆరోగ్యమస్తు
- చక్కగా నిద్ర పట్టాలంటే..!
 - పది నిమిషాలు ఇలా చేస్తే.. ఫిట్‌గా మారిపోవచ్చుట!
 - ‘మఖానా’.. పోషకాల ఖజానా!
 - అభయ ముద్ర
 - తింటున్నా... నీరసమే!
 
అనుబంధం
- పిల్లల ముందు ఇలా చేయకూడదట!
 - ఆ రెండింటి సమన్వయానికీ..!
 - బంధం ప్రమాదకరంగా మారుతోందా..?
 - మీరు ‘మైండ్‌ఫుల్’ తల్లిదండ్రులేనా..!
 - అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారా?
 
యూత్ కార్నర్
- హ్యాట్సాఫ్... అమ్మాయిలూ
 - Shafali Verma: అందుకే అప్పుడు అబ్బాయిలా వేషం మార్చుకున్నా..!
 - జెన్ జీ అమ్మాయిలు మరచిపోతున్నారా..!
 - మీరే ఒక సైన్యం!
 - ప్రపంచ వేదికపై ప్రకృతి ప్రతినిధి!
 
'స్వీట్' హోం
- చిమ్నీలు వాడుతున్నారా?
 - ఒత్తిడిని తగ్గించే ఫిష్ ట్యాంక్లివి..!
 - వెన్నతో.. ఇలా కూడా!
 - ఉసిరి దీపానికి స్టాండ్!
 - అందాల ఆలమండా!
 
వర్క్ & లైఫ్
- బాగా పని చేయాలంటే..!
 - అమ్మాయిలూ... ధైర్యమే మీ పెట్టుబడి!
 - అపరాధ భావంతో బాధపడుతున్నారా?
 - పొగిడితే ఆనందం!
 - బ్లూమ్ స్క్రోలింగ్ చేద్దామా..!
 































            








