Bomb blasts: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన అఫ్గాన్‌.. 33మంది మృతి

అఫ్గానిస్థాన్‌ మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న వేళ మసీదు, ఓ మతపరమైన పాఠశాల.....

Published : 23 Apr 2022 04:55 IST


(ప్రతీకాత్మక చిత్రం)

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న వేళ మసీదు, ఓ మతపరమైన పాఠశాల లక్ష్యంగా చేసుకొని ముష్కర మూకలు బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 33 మంది మృతిచెందగా.. 43 మందికి పైగా గాయపడినట్టు తాలిబన్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ తెలిపారు. వీరిలో అధికంగా విద్యార్థులే ఉన్నట్టు పేర్కొన్నారు. కుందుజ్‌ ప్రావిన్స్‌లోని ఇమామ్‌ సాహెబ్‌ పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకున్నట్టు ఆయన ట్విటర్‌లో తెలిపారు. ఈ ఘాతుక చర్యను ఖండించిన ముజాహిద్‌.. మృతులకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మరోవైపు, గురువారం మజర్‌-ఈ-షరిఫ్‌ ప్రావిన్స్‌లోని ఓ మసీదులో బాంబు పేలుడు జరగ్గా.. దాదాపు 10మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ బాంబు దాడులకు బాధ్యత వహిస్తూ ఏ సంస్థా ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. కానీ, ఇది అఫ్గానిస్థాన్‌ ఇస్లామిక్‌ స్టేట్‌ అనుబంధ సంస్థ పనే అయి ఉంటుందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని