Fire Tragedy: బంగారు గనిలో అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి

లాటిన్ అమెరికాలో బంగారం ఉత్పత్తిలో పెరు(Peru)దే మొదటిస్థానం. తాజాగా ఆ దేశంలోని ఓ బంగారు గనిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 

Published : 08 May 2023 12:44 IST

లిమా: దక్షిణ అమెరికా దేశమైన పెరు(Peru)లో ఘోరం జరిగింది. బంగారు గనిలో అగ్నిప్రమాదం సంభవించడంతో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వారంతా నైట్‌ షిఫ్ట్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు. (Fire Tragedy in Gold Mine)

అరిక్విపా నగరానికి సమీపంలోని గనిలో అగ్నిప్రమాదం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రాథమిక సమాచారం మేరకు షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించడంతో మంటలు వ్యాపించాయని తెలిపింది. ఘటన సమయంలో గని కార్మికులందరూ 100 మీటర్ల లోతులో పనులు చేస్తున్నారని పేర్కొంది. వారిలో 27 మంది దుర్మరణం పాలయ్యారని, 175 మందిని సురక్షితంగా తరలించామని మైనింగ్ సంస్థ వెల్లడించింది.

ప్రస్తుతం ఆ ప్రాంతమంతా రోదనలతో మిన్నంటింది. తమ వారు ప్రాణాలతో తిరిగిరావాలని బాధితుల కుటుంబ సభ్యులు ప్రార్థనలు చేస్తున్నారు. ‘ఎక్కడున్నావ్‌ డార్లింగ్..?’అంటూ ఓ మహిళ భర్త కోసం రోదించిన తీరు అక్కడున్నవారిని కలచివేసింది. సహాయచర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ ఈ స్థాయి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు