Afghanistan Earthquake: ఆదరించిన కుటుంబం మరణించిందని తెలియక..!
కాబుల్: శిథిలాలుగా మారిన ఓ ఇంటి వద్ద తనను చేరదీసిన కుటుంబం కోసం వెతుకుతోంది ఓ శునకం. ఇన్నాళ్లు తన బాగోగులు పట్టించుకున్నవారు ఇప్పుడు కనిపించడం లేదని మూగగా రోదిస్తోంది. పదే పదే ఆ ఇంటివద్దకు వస్తూ.. అక్కడే తచ్చాడుతోంది. ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారిన చిత్రాన్ని చూస్తుంటే ఇదే భావన కలుగుతోంది.
గతవారం కల్లోలిత అఫ్గానిస్థాన్(Afghanistan)లో భూకంపం(Earthquake) పెను విధ్వంసం సృష్టించింది. ఆ దేశ మారుమూల పర్వత ప్రాంతంలో సంభవించిన ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల సుమారు వెయ్యిమంది మరణించారు. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. వేలల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ శునకాన్ని పెంచుకుంటున్న పక్టికాలోని ఓచ్కి గ్రామానికి చెందిన కుటుంబం మొత్తం ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఇది మాత్రం ప్రాణాలతో బయటపడింది. దాంతో తనతో ఉండే కుటుంబం ఎక్కడికెళ్లిపోయిందో తెలియక వారి కోసం వెతుకుతున్నట్లున్న ఈ చిత్రాన్ని నెటిజన్ ఒకరు షేర్ చేశారు. ‘భూకంప ఘటనలో ఈ శునకాన్ని పెంచుకుంటున్న కుటుంబమంతా మరణించింది. అక్కడివారు కొందరు దీనిని తీసుకెళ్లి ఆహారం అందించి, జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు చెప్పారు. కానీ ఇది మాత్రం పదేపదే శిథిలమైన ఆ ఇంటికివద్దకు వచ్చి తన వారిని వెతుక్కుంటోంది. మూగగా రోదిస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రం నెటిజన్లను కదిలిస్తోంది. మునుపటిలా ప్రేమను పంచే కొత్త కుటుంబం దానికి దొరకాలని కోరుకుంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR: కేంద్రం నిర్ణయం చేనేత పరిశ్రమకు మరణశాసనమే: కేటీఆర్
-
Sports News
INDw vs AUSw : అమ్మాయిలూ... ప్రతీకారం తీర్చుకోవాలి.. పసిడి పట్టేయాలి!
-
India News
ISRO: SSLV ప్రయోగం అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు..
-
Sports News
CWG 2022: పురుషుల ట్రిపుల్ జంప్‌లో భారత్‌కు స్వర్ణం-రజతం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Pooja Hegde: ‘సీతారామం’ హిట్.. ‘పాపం పూజా’ అంటోన్న నెటిజన్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యామేనన్
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- సూర్య అనే నేను...
- INDIA vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం