Ferry: ప్రయాణికుల నౌకలో అగ్నిప్రమాదం.. 31 మంది మృతి..!
ఫిలిప్పైన్స్‌లో ఓ ప్రయాణికుల నౌకలో సంభవించిన అగ్నిప్రమాదంలో దాదాపు 31 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 230 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు.
మనీలా: ఫిలిప్పైన్స్ (Philippines)లో విషాదం నెలకొంది. స్థానికంగా దీవుల మధ్య రాకపోకలు సాగించే ఓ ప్రయాణికుల నౌక (Ferry)లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం (Fire Accident)లో.. దాదాపు 31 మృతి చెందారు. మృతుల్లో ఆరు నెలల పాప కూడా ఉంది. కోస్ట్‌గార్డ్ అధికారుల వివరాల ప్రకారం.. దక్షిణ ఫిలిప్పైన్స్‌లోని బసిలాన్(Basilan) ద్వీపం వద్ద బుధవారం రాత్రి సమయంలో ‘ఎంవీ లేడీ మేరీ జాయ్ 3’ అనే ప్రయాణికుల నౌకలో మంటలు చెలరేగాయి. ఘటనా సమయంలో.. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఫెర్రీలో కింది డెక్‌లోని ఏసీ క్యాబిన్స్‌లో నిద్రిస్తున్నారు.
అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో నీళ్లలోకి దూకడంతో.. 10 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే నౌక వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. గురువారం తెల్లవారుజామునాటికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తదనంతరం.. నౌకలో కాలిపోయిన స్థితిలో మరో 21 మంది మృతదేహాలు బయటపడ్డాయని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 35 మంది సిబ్బందితోసహా మొత్తం 230 మందిని రక్షించినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించే దిశగా దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి
-
Politics News
Congress: ఆ ఒక్క ఎమ్మెల్యే తృణమూల్‌లో చేరిక.. బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మళ్లీ ఖాళీ!