Boeing 737: రన్‌వే పై జారిన బోయింగ్‌ 737 విమానం.. 10మందికి గాయాలు

ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం రన్‌వేపై జారిపడిన ఘటన సెనెగల్‌లో చోటుచేసుకుంది.

Published : 09 May 2024 17:40 IST

డాకర్‌: ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్‌ 737 విమానం ప్రమాదానికి గురైంది. సెనెగల్‌ రాజధాని డాకర్‌ విమానాశ్రయంలో విమానం రన్‌వేపై జారింది. ఈ ఘటనలో పది మందికి గాయాలైనట్లు ఆ దేశ రవాణా శాఖ మంత్రి వెల్లడించారు. ట్రాన్స్‌ఎయిర్‌ సంస్థకు చెందిన ఎయిర్‌ సెనెగల్‌ విమానం బుధవారం అర్ధరాత్రి బమాకోకు బయల్దేరి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో మొత్తం 85మంది ఉండగా.. వీరిలో 79మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలట్లు, నలుగురు క్యాబిన్‌ సిబ్బంది ఉన్నట్లు మంత్రి తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. మిగతా అందరినీ విశ్రాంతి కోసం హోటల్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు