Alimihan Seyiti: చైనాలో 135ఏళ్ల బామ్మ మృతి

చైనాలో అత్యంత కురు వృద్ధురాలు అలీమిహాన్‌ సెయితీ 135 ఏళ్ల వయసులో గురువారం మృతి చెందినట్లు జిన్‌ జియాంగ్‌ ఉయ్‌గుర్‌ అటానమస్‌ రీజియన్‌ స్థానిక అధికారులు తెలిపారు. దేశ ప్రజా...

Published : 18 Dec 2021 23:56 IST

బీజింగ్‌: చైనాలో అత్యంత కురు వృద్ధురాలు అలీమిహాన్‌ సెయితీ 135 ఏళ్ల వయసులో గురువారం మృతి చెందినట్లు జిన్‌ జియాంగ్‌ ఉయ్‌గుర్‌ అటానమస్‌ రీజియన్‌ స్థానిక అధికారులు తెలిపారు. దేశ ప్రజా వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం కోముక్సిరిక్‌ టౌన్‌ షిప్‌కు చెందిన సెయితీ 1886లో జూన్‌ 25న జన్మించారు.2013లో చైనా అసోషియేషన్‌ ఆఫ్‌ జెరొంటాలజీ అండ్‌ జెరియాట్రిక్స్‌ జారీ చేసిన చైనాలోని అత్యంత వృద్ధుల జాబితాలో ఈమె అగ్రస్థానంలో నిలిచారు.దీనిని గతంలో జిరంటలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ చైనాగా పిలిచేవారని చైనాలోని ఓ వార్తా సంస్థ తన కథనంలో తెలిపింది. మరణించే వరకు కూడా సరళమైన సాధారణ, రోజువారీ జీవితాన్ని గడిపిందని, సమయానికి తింటూ తన పెరట్లో సుఖమయమైన జీవితాన్ని గడిపిందని పేర్కొన్నారు. కొన్నాళ్లపాటు ఆమె తన మునిమనుమళ్లను చూసుకోవడంలో సహాయం చేసిందని వెల్లడించారు.కోముక్సిరిక్‌ టౌన్‌షిప్‌ను దీర్ఘాయువు పట్టణం (longevity town)గా పిలుస్తారని, 90ఏళ్లకు పైబడిన అనేక మంది వృద్ధులు ఇక్కడ జీవిస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడి ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవల కారణంగా వృద్ధుల దీర్ఘాయువుకు దోహదం చేస్తున్నట్లు  తెలిపారు. ప్రభుత్వం 60ఏళ్లు పైబడిన వారికి  కాంట్రాక్టు పద్ధతిన వైద్యసేవలు, ఏటా ఉచితంగా హెల్త్‌ చెకప్‌, వయసుల వారీగా నెలవారీగా సబ్సిడీలు అందించడం వృద్ధులకు వరంగా మారిందని కథనంలో వివరించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని