Covid: వైరస్‌కు గురైన తొలి ఏడాదిలో.. కొవిడ్‌తో మెదడుకు చేటు

కరోనా వైరస్‌కు గురైన తొలి ఏడాదిలో బాధితులు నాడీ సంబంధ రుగ్మతల పాలయ్యే ప్రమాదం ఎక్కువని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు ధ్రువీకరించారు.

Updated : 24 Sep 2022 09:29 IST

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌కు గురైన తొలి ఏడాదిలో బాధితులు నాడీ సంబంధ రుగ్మతల పాలయ్యే ప్రమాదం ఎక్కువని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు ధ్రువీకరించారు. జ్ఞాపకశక్తి, గ్రహణశక్తి తగ్గిపోవడంతో పాటు... ఆదుర్దా, కుంగుబాటు, పక్షవాతం వంటి సమస్యలు కొవిడ్‌ బాధితులకు ఎదురవుతున్నాయి. మెదడు కణాలపై దుష్ప్రభావం కారణంగా కాళ్లూ చేతులను కదిలించడంలో ఇబ్బందులు, మూర్చ తలెత్తుతున్నాయి. వినికిడి, చూపు సమస్యలు కూడా వారిని వేధిస్తున్నాయి. కొవిడ్‌ బాధితులు ఒక్కోసారి పార్కిన్సన్‌ బాధితుల్లా సరిగా నిలుచోలేక కిందపడిపోవడమూ జరుగుతోంది. వీటిని ‘లాంగ్‌ కోవిడ్‌’ లక్షణాలుగా పరిశోధకులు పేర్కొన్నారు. కొవిడ్‌-19 వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 4 కోట్ల నాడీ రుగ్మతల కేసులు నమోదైనట్లు పరిశోధకులు విశ్లేషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని