Turkey: భూకంపాన్ని ఇలా చూసి ఉండరు..!

తుర్కియేలో తాజాగా వచ్చిన భూకంపంలో స్వల్ప ప్రాణనష్టం చోటు చేసుకొంది. ఈ ఘటనను ఓ కారు డ్యాష్‌ బోర్డ్‌ కెమేరాలో చిత్రీకరించారు. 

Published : 22 Feb 2023 01:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తుర్కియేలో సోమవారం రాత్రి మరోసారి భూమి కంపించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 6.4గా నమోదైంది. ఈ ఘటనలో తుర్కియేలో ఆరుగురు చనిపోగా.. మరో 294 మంది గాయపడ్డారు. వీరిలో 18 మంది పరిస్థితి విషమంగా ఉంది. సిరియాలో ఇప్పటికే దెబ్బతిన్న పలు భవనాలు కుప్పకూలినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడే రెండు వారాల క్రితం 7.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చి 50 వేల మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదేశాల్లో సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బందిని శిథిలాల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  భూకంప కేంద్రం ఇక్కడి డెఫ్నె నగర సమీపంలో ఉన్నట్లు గుర్తించారు.భూకంప ప్రభావం సిరియా, జోర్డాన్‌, ఇజ్రాయెల్‌ దేశాల్లోనూ స్వల్పంగా కనిపించింది. దీని తీవ్రత ఉన్న ప్రదేశాల్లో ఇప్పటికే భవనాలు కూలిపోవడంతో పెద్దగా ప్రాణనష్టం లేదని అధికారులు పేర్కొన్నారు. 

తుర్కియేలోని హతయ్‌ ప్రాంతంలోని ఓ కారు డ్యాష్‌బోర్డ్‌ కెమేరా ఈ తాజా భూకంపాన్ని రికార్డు చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. భూప్రకంపనల దెబ్బకు కారు పక్కనే ఉన్న రోడ్డు కూడా కదిలిపోయిన దృశ్యాలు నమోదయ్యాయి. తుర్కియేలో వరుస భూకంపాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందాలు, మొబైల్‌ క్లీనిక్‌లు వెంటనే ప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు