France: ఫ్రాన్స్‌కు తొలి ‘గే’ ప్రధాని.. నియమించిన మెక్రాన్‌

ఫ్రాన్స్‌ ప్రధానిగా ఎలిజబెత్ బెర్న్‌ స్థానంలో గాబ్రియెల్‌ అట్టల్‌(Gabriel Attal) నియమితులయ్యారు. 

Updated : 09 Jan 2024 19:18 IST

పారిస్‌: ఫ్రాన్స్‌(France)కు కొత్త ప్రధాని వచ్చారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్(Emmanuel Macron ).. విద్యాశాఖ మంత్రి గాబ్రియెల్‌ అట్టల్‌(Gabriel Attal)ను ప్రధానిగా నియమించారు. అట్టల్‌.. ఈ పదవి చేపట్టిన అతి పిన్నవయస్కుడు. ప్రస్తుతం ఆయన వయసు 34. స్వలింగ సంపర్కుడని తెలుస్తోంది.

ప్రధాని పదవికి ఎలిజబెత్‌ బోర్న్‌ రాజీనామా చేయడంతో తాజా నియామకం జరిగింది. ఇటీవల తెచ్చిన వివాదాస్పద ఇమిగ్రేషన్‌ చట్టంపై రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బోర్న్‌ రాజీనామా చేశారు. సోమవారం మెక్రాన్‌ దానికి ఆమోదం తెలిపారు. కొత్త చట్టం ప్రకారం.. విదేశీయులను వెనక్కి పంపేందుకు ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు లభిస్తాయి.

బీజింగ్‌ చేతికి ఇండో-పసిఫిక్‌ డేటా.. చైనా గూఢచారికి అమెరికాలో జైలు శిక్ష..

కొవిడ్ మహమ్మారి వేళ.. అట్టల్ పేరు బాగా వినిపించింది. అప్పుడు ఆయన ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించారు. మెక్రాన్‌కు సన్నిహితుడిగా పేరుంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వార్తల నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని