లండన్‌కు సమీపంలో.. ఆ గ్రామమంతా ఓ కుటుంబమే

ఉరుకుల పరుగుల ప్రపంచానికి దూరంగా, ప్రకృతి ఒడిలో ప్రత్యేకంగా ఓ గ్రామాన్ని నిర్మించుకొని మరీ నివసిస్తోంది ఓ కుటుంబం.

Updated : 02 Mar 2023 08:07 IST

రుకుల పరుగుల ప్రపంచానికి దూరంగా, ప్రకృతి ఒడిలో ప్రత్యేకంగా ఓ గ్రామాన్ని నిర్మించుకొని మరీ నివసిస్తోంది ఓ కుటుంబం. తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నారు. అంతేకాదండోయ్‌.. ఓ స్విమ్మింగ్‌ పూల్‌, కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అమెరికా కెంటకీ రాష్ట్రంలోని లండన్‌ పట్టణ సమీపంలో ఆ గ్రామం కనిపిస్తుంది.

ర్యాన్‌ బ్రింక్స్‌, కెలీ దంపతులు, వారి కుమార్తె లెనాక్స్‌, కుమారుడు బ్రాడీ అక్కడ ప్రశాంత జీవితం గడుపుతున్నారు. వారి కుటుంబం గతంలో మిషిగన్‌లో నివసించేది. అయితే ప్రకృతి ఒడిలో, పర్యావరణహితమైన విధానంలో జీవించాలన్న కోరిక వారికి ఉండేది. దీంతో 2015లో వారు ఇక్కడ 21 ఎకరాల భూమిని 57 వేల డాలర్లకు కొనుగోలు చేశారు. భూముల ధరలు చౌకగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. కంటైనర్లతో ఇళ్లు తయారు చేసే సంస్థను సంప్రదించి 20 వేల డాలర్లు చెల్లించి తమకు కావాల్సిన సదుపాయాలతో ఆరు గృహాలను సిద్ధం చేయించుకున్నారు. 280 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇంటిలో కేలి, రియాన్‌ దంపతులు ఉంటున్నారు. ఒకొక్కటి 160 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న రెండు ఇళ్లలో లెనాక్స్‌, బ్రాడీ నివసిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని