అమెరికాలోని హిందూ వర్సిటీకి రూ.8.20 కోట్లు

అమెరికాలోని ఫ్లోరిడాలో హిందూ తత్వశాస్త్ర సిద్ధాంతాలను బోధిస్తున్న హిందూ యూనివర్సిటీ ఆఫ్‌ అమెరికా(హెచ్‌యూఏ)కు ఓ ఇండో అమెరికన్‌ వ్యాపారవేత్త భారీ విరాళాన్ని ప్రకటించారు.

Published : 31 Mar 2023 05:11 IST

ఇండో-అమెరికన్‌ వ్యాపారవేత్త రమేశ్‌ భూటాడా విరాళం

వాషింగ్టన్‌: అమెరికాలోని ఫ్లోరిడాలో హిందూ తత్వశాస్త్ర సిద్ధాంతాలను బోధిస్తున్న హిందూ యూనివర్సిటీ ఆఫ్‌ అమెరికా(హెచ్‌యూఏ)కు ఓ ఇండో అమెరికన్‌ వ్యాపారవేత్త భారీ విరాళాన్ని ప్రకటించారు. హ్యూస్టన్‌లోని స్టార్‌ పైప్‌ ప్రొడక్ట్స్‌ సీఈవో రమేశ్‌ భూటాడా రూ.8.20 కోట్లు(పది లక్షల డాలర్లు) అందజేశారు. భూరి విరాళాన్ని అందించిన రమేశ్‌ను విశ్వవిద్యాలయ నిర్వాహకులు సన్మానించారు. ఈ విశ్వవిద్యాలయానికి వచ్చిన అతిపెద్ద విరాళం ఇదే. 1989లో ప్రారంభమైన హెచ్‌యూఏ 1993లో ఫ్లోరిడా ప్రభుత్వ గుర్తింపు పొందింది. నేటితరం యువత హిందూమతానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని తెలుసుకుంటూ సంతృప్తికర జీవనవిధానాన్ని అలవర్చుకోవాలన్న సంకల్పంతో వర్సిటీకి ఈ విరాళం అందించినట్లు రమేశ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని