శరీర బరువునూ, మధుమేహాన్నీ తగ్గించే రసాయనం

బేరియాట్రిక్‌ శస్త్రచికిత్స చేయించుకోకుండానే స్థూలకాయాన్నీ, మధుమేహాన్నీ తగ్గించడానికి తోడ్పడే కొత్త రసాయనాన్ని రాబర్ట్‌ డాయల్‌, క్రిస్టియన్‌ రాత్‌ అనే అమెరికన్‌ పరిశోధకులు కనుగొన్నారు.

Updated : 02 Apr 2023 10:01 IST

వాషింగ్టన్‌: బేరియాట్రిక్‌ శస్త్రచికిత్స చేయించుకోకుండానే స్థూలకాయాన్నీ, మధుమేహాన్నీ తగ్గించడానికి తోడ్పడే కొత్త రసాయనాన్ని రాబర్ట్‌ డాయల్‌, క్రిస్టియన్‌ రాత్‌ అనే అమెరికన్‌ పరిశోధకులు కనుగొన్నారు. ఈ రసాయనం లేదా పెప్టైడ్‌ శరీర బరువుతోపాటు మధుమేహాన్నీ తగ్గిస్తుంది. బేరియాట్రిక్‌ శస్త్రచికిత్స తరువాత ఉదరంలో గ్లూకగాన్‌ తరహా పెప్టైడ్‌-1 (జీఎల్పీ-1), పెప్టైడ్‌ వైవై (పీవైవై) అనే హార్మోన్ల స్థాయులు మారతాయి. దానివల్ల కొంచెం తిన్నా కడుపు నిండిపోయి ఆకలి తీరిన అనుభూతి కలిగి, తద్వారా రక్తంలో చక్కెర శాతం తగ్గిపోతుంది. క్లోమ గ్రంథిలో, మెదడులో జీఎల్పీ-1 రిసెప్టర్లను ప్రేరేపించి కడుపు నిండిపోయిన అనుభూతిని కలిగించే లిరాగ్లుటైడ్‌ అనే మందు మార్కెట్‌లో అందుబాటులో ఉంది. జీఎల్పీ-1ను మాత్రమే ప్రేరేపించే లిరాగ్లుటైడ్‌ ఇంజెక్షన్‌ కన్నా మూడు రెట్లు ఎక్కువ బరువును తగ్గించే జీఈపీ-44 పెప్టైడ్‌ను డాయల్‌ బృందం రూపొందించింది. అది జీఎల్పీ-1తోపాటు పీవైవై రిసెప్టార్లనూ ప్రేరేపించి 80 శాతం తక్కువ తిండితోనే సరిపెట్టుకునేట్లు చేస్తుందని ఎలుకల మీద పరిశోధనలు తేల్చాయి. లిరాగ్లుటైడ్‌ మాదిరిగా ఈ పెప్టైడ్‌ వాంతులు, తలతిరుగుడు వంటి ప్రభావాలను కలిగించదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు