ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ను చైనా కంపెనీలు ఆవిష్కరించాయి. ఇది సెకనుకు 1.2 టెరాబైట్స్‌ వేగంతో డేటాను ట్రాన్స్‌మిట్‌ చేయగలదని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు పత్రిక వెల్లడించింది.

Updated : 16 Nov 2023 05:39 IST

చైనాలో ఆవిష్కరణ
సెకనుకు 150 హెచ్‌డీ సినిమాలు పంపుకోవచ్చు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ను చైనా కంపెనీలు ఆవిష్కరించాయి. ఇది సెకనుకు 1.2 టెరాబైట్స్‌ వేగంతో డేటాను ట్రాన్స్‌మిట్‌ చేయగలదని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రధాన నెట్‌వర్క్‌లు సెకనుకు 100 గిగాబైట్ల డేటాను మాత్రమే ట్రాన్స్‌మిట్‌ చేస్తుండగా, నూతన వ్యవస్థ దాదాపు 10 రెట్లు వేగంగా పనిచేస్తోందని పేర్కొంది. ఇటీవల అమెరికాలో ప్రారంభించిన 5వ జనరేషన్‌ ఇంటర్నెట్‌-2 కూడా అత్యధికంగా సెకనుకు 400 గిగాబైట్ల వేగంతోనే డేటాను ప్రసారం చేయగలుగుతోంది. తాజా ప్రాజెక్టును సింఘ్వా విశ్వవిద్యాలయం, చైనా మొబైల్‌, హువావే టెక్నాలజీస్‌, సెర్నెట్‌ కార్పొరేషన్‌ సమష్టిగా అభివృద్ధి చేశాయి. ప్రత్యేకమైన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ సాయంతో ఈ నెట్‌వర్క్‌ను 3 వేల కి.మీ. దూరం ఏర్పాటు చేశారు. ఇది బీజింగ్‌, వుహాన్‌, గ్వాంగ్జూ నగరాలను కలుపుతుంది. ఈ నెట్‌వర్క్‌ అన్ని రకాల ఆపరేషనల్‌ టెస్ట్‌లను పూర్తి చేసుకొని సమర్థంగా పనిచేస్తోంది. ఈ నెట్‌వర్క్‌ పనితీరును హువావే టెక్నాలజీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వాంగ్‌ లీ వివరిస్తూ.. 150 హైడెఫినెషన్‌ (హెచ్‌డీ) సినిమాలకు సమానమైన డేటాను కేవలం ఒక్క సెకనులో పంపించగలదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు