రష్యా దళాలపై ‘మౌస్‌ ఫీవర్‌’ ప్రభావం

రష్యా సైనికులు మౌస్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారని, ఆ వ్యాధి మాస్కో బలగాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఉక్రెయిన్‌ నిఘా సమాచారాన్ని ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Published : 23 Dec 2023 06:11 IST

పెద్దగా పట్టించుకోని మాస్కో కమాండర్లు: ఉక్రెయిన్‌

మాస్కో: రష్యా సైనికులు మౌస్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారని, ఆ వ్యాధి మాస్కో బలగాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఉక్రెయిన్‌ నిఘా సమాచారాన్ని ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ చలికాలంలో సరైన సదుపాయాలు కొరవడడంతో కప్యాన్స్క్‌లోని రష్యన్‌ దళాల్లో ఈ మౌస్‌ ఫీవర్‌ ప్రబలిందని ఉక్రెయిన్‌ నిఘా విభాగం పేర్కొంది. ఇది ఒక బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌. ఎలుకలను తాకినప్పుడు, వాటి వ్యర్థాల మీదుగా వచ్చే గాలిని పీల్చినప్పుడు సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి బారినపడినవారిలో తీవ్రమైన తలనొప్పి, జ్వరం, దద్దుర్లు, ఎర్రగా కందిపోవడం, బీపీ తగ్గడం, కళ్లు ఎర్రగా మారిపోవడం, పలుమార్లు వాంతులు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపింది. అయితే ఈ వ్యాధి వ్యాప్తిని రష్యా కమాండర్లు పట్టించుకోవడం లేదని ఉక్రెయిన్‌ నిఘా విభాగం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు