రంజాన్‌ మాసంలో కాల్పుల విరమణ!

గాజాలో ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య వచ్చే సోమవారానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు.

Updated : 28 Feb 2024 06:14 IST

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆశాభావం

జెరూసలెం, న్యూయార్క్‌: గాజాలో ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య వచ్చే సోమవారానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ఆ దిశగా కొనసాగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని మంగళవారం వెల్లడించారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న రంజాన్‌ మాసమంతా కాల్పుల విరమణ పాటించే అవకాశముందని, అయితే బందీలను విడిచిపెట్టేందుకు హమాస్‌ అంగీకరించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకైతే ఒక నిర్దిష్ట ఒప్పందం కుదరలేదని స్పష్టం తెలిపారు. ఇరు పక్షాల మధ్య సంధిలో భాగంగా.. హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న వారిని విడిచి పెట్టాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్‌ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనీయులను విడుదల చేయాలి. గాజాలో మానవతా సాయం కోసం వేచి చూస్తున్న వారి కోసం సహాయ సామగ్రితో వందలాది ట్రక్కులను అనుమతించాలి. దాదాపు 6 వారాల పాటు కాల్పుల విరమణ కొనసాగొచ్చని తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం ఖరారులో వివాదాస్పదంగా మారిన కొన్ని అంశాల్లో ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించినట్లు హమాస్‌ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. దీనిపై ఇప్పటివరకూ ఇజ్రాయెల్‌ నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని