ఫిలిప్పీన్స్‌ చేతికి భారత్‌ బ్రహ్మోస్‌

బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను భారత్‌.. శుక్రవారం ఫిలిప్పీన్స్‌కు అందజేసింది.

Updated : 20 Apr 2024 05:51 IST

దిల్లీ: బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను భారత్‌.. శుక్రవారం ఫిలిప్పీన్స్‌కు అందజేసింది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక బంధానికి ఇది నిదర్శనం. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్‌లను అందించేందుకు రెండేళ్ల కిందట 37.5 కోట్ల డాలర్ల ఒప్పందాన్ని భారత్‌ కుదుర్చుకుంది. దీనికింద మన దేశం మూడు బ్యాటరీల క్షిపణులు, లాంచర్లు, సంబంధిత ఇతర పరికరాలను సరఫరా చేయాలి. బ్రహ్మోస్‌ క్షిపణికి సంబంధించి ఇదే తొలి ఎగుమతి ఆర్డర్‌. తాజాగా భారత వాయుసేనకు చెందిన సి-17 గ్లోబ్‌మాస్టర్‌ విమానంలో ఈ క్షిపణులను ఫిలిప్పీన్స్‌కు మన దేశం చేరవేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని