మలేరియాతో వార్ధక్య సంబంధ జన్యు మార్పులు

మలేరియా ఇన్‌ఫెక్షన్‌ వల్ల.. వయసు మీద పడే ప్రక్రియతో ముడిపడిన జన్యు మార్పులు చోటుచేసుకుంటున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది.

Published : 08 May 2024 05:44 IST

దిల్లీ: మలేరియా ఇన్‌ఫెక్షన్‌ వల్ల.. వయసు మీద పడే ప్రక్రియతో ముడిపడిన జన్యు మార్పులు చోటుచేసుకుంటున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. మలేరియా ఉద్ధృతంగా ఉన్న ఆఫ్రికా దేశాల్లో జరిపిన పరిశీలనల్లో ఇది వెల్లడైంది. అక్కడ దాదాపు 1800 మంది నుంచి రక్త నమూనాలను సేకరించారు. దాని నుంచి జన్యు పదార్థాన్ని వెలికితీశారు. ముఖ్యంగా తెల్ల రక్తకణాల్లోని డీఎన్‌ఏను విశ్లేషించారు. ఇన్‌ఫెక్షన్లపై పోరులో అది కీలకం. ఆ డీఎన్‌ఏలోని టెలోమీర్ల పొడవును లెక్కించారు. టెలోమీర్లు అనేవి క్రోమోజోముల చివర్లో ఉంటాయి. క్రోమోజోములు పరస్పరం అతుక్కోకుండా ఇవి నిలువరిస్తాయి. వయసు పెరిగేకొద్దీ వాటి పొడవు తగ్గిపోతుంటుంది. వార్ధక్య సంబంధ వ్యాధులు, మరణం ముప్పును అంచనావేయడానికి ఇవి సాయపడతాయి. మలేరియా ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్రాంతాల్లోని ప్రజల తెల్లరక్త కణాల్లో టెలోమీర్ల పొడవు తక్కువగా ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఇన్‌ఫెక్షన్‌ వల్ల తెల్లరక్త కణాలు భారీగా దెబ్బతింటాయి. ఈ ప్రక్రియ, ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి కొత్త కణాల తయారీకి అవసరమయ్యే కసరత్తు కారణంగా ఈ పరిస్థితి ఉత్పన్నమై ఉండొచ్చని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు