Covid:గర్భిణికి కొవిడ్‌.. పిండంలో రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం!

గర్భిణులు కొవిడ్‌ మహమ్మారి బారిన పడితే.. గర్భస్థ శిశువుల్లోనూ సంబంధిత ప్రభావాలు కనిపిస్తాయని పరిశోధకులు తాజా అధ్యయనంలో తేల్చారు. పిండంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించకపోయినా.. దాని తాలూకు

Published : 21 Jan 2022 07:58 IST

వాషింగ్టన్‌: గర్భిణులు కొవిడ్‌ మహమ్మారి బారిన పడితే.. గర్భస్థ శిశువుల్లోనూ సంబంధిత ప్రభావాలు కనిపిస్తాయని పరిశోధకులు తాజా అధ్యయనంలో తేల్చారు. పిండంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించకపోయినా.. దాని తాలూకు రోగనిరోధకత స్పందనలు మాత్రం అందులో కచ్చితంగా ఉంటాయని నిర్ధారించారు. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌) పరిశోధకులు 23 మంది గర్భిణులపై (వీరిలో 12 మంది కొవిడ్‌ బాధితులు) ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కొవిడ్‌ సోకిన గర్భిణుల్లో.. వ్యాధి లక్షణాలతో సంబంధం లేకుండా ఇంటర్‌ల్యూకిన్‌-8, ఇంటర్‌ల్యూకిన్‌-15, ఇంటర్‌ల్యూకిన్‌-10 వంటి సైటోకైన్ల స్థాయులు పెరిగినట్లు వారు గుర్తించారు. ఆ తల్లులకు జన్మించే శిశువుల్లోనూ ఇంటర్‌ల్యూకిన్‌-8 సంబంధిత ఇన్‌ఫ్లమేటరీ ప్రతిస్పందనలు కనిపించాయని తెలిపారు. గర్భస్థ శిశువుల్లోకి, మాయ (ప్లాసెంటా)లోకి వైరస్‌ ప్రవేశించనప్పటికీ ఇలాంటి ప్రతిస్పందనలు ఉంటున్నాయని పేర్కొన్నారు. గర్భిణి కొవిడ్‌ బారిన పడటం వల్ల పిండంలోని రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమవుతుందని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని