Ukraine Crisis: ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ కల్పిత పాత్ర

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన తొలి రోజుల్లో ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ పేరు వినిపించింది. రష్యా యుద్ధ విమానాలను ఓ ఉక్రెనియన్‌ ఫైటర్‌ పైలట్‌ క్షణాల్లో కూల్చేసి మాస్కోకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అతడిని

Updated : 03 May 2022 05:53 IST

ఆ పేరుతో ఎలాంటి పైలట్‌ లేరు: ఉక్రెయిన్‌ సైన్యం

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన తొలి రోజుల్లో ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ పేరు వినిపించింది. రష్యా యుద్ధ విమానాలను ఓ ఉక్రెనియన్‌ ఫైటర్‌ పైలట్‌ క్షణాల్లో కూల్చేసి మాస్కోకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అతడిని ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’గా పేర్కొనడం ప్రారంభించాయి. దీంతో ఉక్రెయిన్‌ ప్రజలు.. ఆ పైలట్‌ను హీరోగా చూడడం ప్రారంభించారు. యుద్ధం తొలి రోజే ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ ఆరు యుద్ధ విమానాలను నేలకూల్చి పుతిన్‌ సేనలకు దడ పుట్టించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఆ ఘోస్ట్‌ పేరును మేజర్‌ స్తెపాన్‌గా ఇటీవల కొన్ని పత్రికలు ప్రకటించాయి. స్తెపాన్‌ చనిపోయేనాటికి 40 రష్యా యుద్ధ విమానాలను కూల్చినట్లు వార్తలొచ్చాయి. దీనిపై ఉక్రెయిన్‌ వైమానికదళం వివరణ ఇచ్చింది. ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ పేరుతో ఎలాంటి పైలట్‌ లేరని స్పష్టం చేసింది. అది కేవలం ఓ కల్పిత పాత్ర అని పేర్కొంది. మేజర్‌ స్తెపాన్‌ ఆ పైలట్‌ అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని వెల్లడించింది.  ‘‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌ అనే సూపర్‌ హీరో పాత్రను ఉక్రేనియన్లు సృష్టించారు’’ అని ఎయిర్‌ ఫోర్స్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు