- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
రష్యా గుప్పిట్లోకి డాన్‌బాస్
లుహాన్స్క్‌ను చేజిక్కించుకున్నాం
పుతిన్ ప్రకటన
కీవ్: డాన్‌బాస్ ప్రాంత విముక్తి కోసం ప్రత్యేక సైనిక చర్య ప్రారంభించామని చెబుతూ వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్- ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరినట్లు ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ కూడా తమ బలగాల చేజిక్కిందని, డాన్‌బాస్ ప్రాంతంలోని కీలక ప్రాతాలన్నింటిపైనా తాము పట్టు సాధించామని తెలిపారు. ఇక్కడ పోరాటంలో పాల్గొన్న తమ బలగాలు విజయం సాధించాయని సోమవారం పుతిన్ వివరించారు. అయితే తాము వెనక్కి తగ్గడం వాస్తవమే అయినా అక్కడ మరోసారి పోరాటం చేస్తామని ఉక్రెయిన్ సైనికాధికారులు ప్రతినబూనారు. తమకు ఆధునిక ఆయుధాల సరఫరా పెరిగిందని ఈ సందర్భంగా చెప్పారు. కాగా స్లొవియాన్స్క్‌పై సోమవారం రష్యా దాడుల్లో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
భూతల నరకం ఉంటే అది ఇదే
‘భూమ్మీద నరకమంటూ ఏదైనా ఉంటే అది ఇదే. అటు చూస్తే మంటల్లో నగరాలు. ఇటుచూస్తే క్షతగాత్రులైన సహచరులు. కందకాల్లో తలదాచుకోవడం, నిరీక్షిస్తూ ప్రార్థించడం. ఇదే మా పని’ అని ఉక్రెయిన్ సైనికులు చెబుతున్నారు. డాన్‌బాస్ ప్రాంతం నుంచి వెనక్కి వస్తున్న సైనికులు వార్తాసంస్థలకు ఇచ్చిన ముఖాముఖిలో తమ కష్టాలు పంచుకున్నారు. విరామం లేకుండా కొనసాగుతున్న దాడులతో భయానక పరిస్థితులు నెలకొన్నాయనీ, దానివల్ల మానసికంగానూ ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు చెప్పారు. గాయపడిన వారిని తరలించాలంటే ఒక్కోసారి రెండేసి రోజులు నిరీక్షించాల్సి వచ్చేదని గుర్తు చేసుకున్నారు. మానసిక స్థితి ఎలా ఉన్నప్పటికీ కాళ్లు, చేతులు పని చేస్తున్నట్లయితే యుద్ధక్షేత్రంలోకి వెళ్లాల్సిందేనని తెలిపారు. కుటుంబాలకు దూరంగా ఉండడం, వారి క్షేమ సమాచారం గురించి ఉన్న ఆందోళన తమపై తీవ్ర ప్రభావం చూపేదని సైనికులు పేర్కొన్నారు. కొద్దిపాటి శిక్షణతో తొలిసారి రణక్షేత్రంలో అడుగుపెట్టినవారు అక్కడి పరిస్థితులపై పెదవి విరిచారు. ఆయుధాల పరంగా తమకంటే మెరుగైన స్థితిలో ఉన్న రష్యాతో గట్టిగా పోరాడుతూ దేశం కోసం కట్టుబడి ఉన్నామని మరికొందరు సైనికులు చెప్పారు. సీవీరోదొనెట్స్క్‌లో ప్రత్యక్ష నరకం చవిచూశామని కొందరు సైనికులు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువును మట్టి కరిపించాలనే లక్ష్యంతోనే పోరాటం చేశామని చెప్పారు. రష్యా ఆక్రమణలోకి వెళ్లిన తమ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్ సైనికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
పునర్నిర్మాణానికి ప్రపంచ చేయూత అవసరం: జెలెన్‌స్కీ
ఉక్రెయిన్ పునర్నిర్మాణం యావత్ ప్రపంచ ఉమ్మడి లక్ష్యమని అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. తమ దేశాన్ని తిరిగి నిర్మించడానికి 750 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.60 లక్షల కోట్లు) ఖర్చవుతుందని ప్రధాని డెనిస్ షిమ్‌హాల్ రూపొందించిన ప్రణాళికను ప్రస్తావిస్తూ.. తమ దేశమొక్కటే ఈ పనిని పూర్తిచేయడం సాధ్యం కాదని చెప్పారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం స్విట్జర్లాండ్‌లో జరిగిన సదస్సును ఉద్దేశించి వీడియో ద్వారా ఆయన ప్రసంగించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Chiranjeevi: అభిమానికి క్యాన్సర్.. అండగా నిలిచిన చిరంజీవి
-
India News
Arvind Kejriwal: ప్రజలు పేదలుగా ఉంటే.. దేశం ధనికంగా మారదు.. కేంద్రంపై కేజ్రీవాల్ కౌంటర్
-
Sports News
Deepak - Virat : దీపక్‌కు అంత సులువేం కాదు.. కోహ్లీకి ఒక్క ఇన్నింగ్స్ చాలు!
-
Politics News
CM Kcr: దుష్ట శక్తులకు బుద్ధి చెప్పాలి: వికారాబాద్ సభలో సీఎం కేసీఆర్
-
Politics News
Karnataka: మంత్రి ఆడియో లీక్ కలకలం.. సీఎం బొమ్మైకి కొత్త తలనొప్పి!
-
General News
Andhra News: నిబంధనల ప్రకారమే రెవెన్యూ ఉద్యోగులు దేవాదాయశాఖలోకి: మంత్రి సత్యనారాయణ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Jagan and Chandrababu: పలకరించుకోని జగన్, చంద్రబాబు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
- CM Jagan: స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
- Chinese Spy Ship: భారత్ విజ్ఞప్తులు శ్రీలంక బేఖాతరు.. హంబన్‌టొట చేరిన నిఘా నౌక..!
- Ashwini Dutt: చిరు-రజనీ-శ్రీదేవిలతో ‘రంగీలా’ చేయాలనుకున్నా.. కానీ!
- Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- Google: పనితీరు బాగోలేదో ఇక ఇంటికే.. ఉద్యోగులను హెచ్చరించిన గూగుల్
- Indian Army: 1984లో గల్లంతైన జవాను ఆచూకీ లభ్యం
- Dil Raju: అలా రాసి మమ్మల్ని బలి పశువులను చేయొద్దు: దిల్ రాజు భావోద్వేగం