Updated : 03 Aug 2022 10:28 IST

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రేసులో పుంజుకున్న సునాక్‌

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీ పడుతున్న భారత సంతతి నేత, మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్‌ పుంజుకున్నారు. కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులకు గతవారం నిర్వహించిన పోల్‌లో తన ప్రత్యర్థి, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌తో ఉన్న అంతరాన్ని గణనీయంగా తగ్గించుకోగలిగారు. ప్రస్తుతం ఇద్దరు నేతల మధ్య కేవలం 5 శాతం మాత్రమే తేడా ఉంది. ఇటలీకి చెందిన ప్రజా వ్యవహారాల కంపెనీ టెక్నీ.. గతవారం 807 మంది కన్జర్వేటివ్‌ సభ్యులను సర్వే చేసింది. అందులో రిషి సునాక్‌కు 43% మంది, లిజ్‌ ట్రస్‌కు 48% మంది మద్దతు పలికారు. 9% మంది మాత్రం ఏ విషయాన్నీ వెల్లడించలేదు. మరోవైపు, గతవారం బ్రిటిష్‌ అంతర్జాతీయ మార్కెట్‌ పరిశోధన సంస్థ ‘యూగవ్‌’ నిర్వహించిన సర్వేలో లిజ్‌ ట్రస్‌కు 62% మంది నుంచి మద్దతు లభించగా, రిషికి 38% మంది మద్దతిచ్చారు. ఇద్దరి మధ్య వ్యత్యాసం  24% కనిపించింది. ఇప్పుడు అది అయిదుకు తగ్గడం సునాక్‌కు ఊరటనిచ్చే అంశమే.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని