ప్రతి 8 మందిలో ఒకరికి దీర్ఘకాల కొవిడ్‌ లక్షణాలు

కొవిడ్‌-19 వచ్చి తగ్గిన తర్వాత చాలాకాలం వరకూ దాని దుష్ప్రభావాలు కనిపిస్తుండటాన్ని దీర్ఘకాల కొవిడ్‌ (లాంగ్‌ కొవిడ్‌) అంటారు. కొవిడ్‌-19 వచ్చిన ప్రతి 8 మందిలో ఒకరికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయని ద లాన్సెట్‌ పత్రికలో ప్రచురితమైన తాజా

Published : 06 Aug 2022 08:02 IST

లాన్సెట్‌ పరిశోధనలో వెల్లడి

లండన్‌: కొవిడ్‌-19 వచ్చి తగ్గిన తర్వాత చాలాకాలం వరకూ దాని దుష్ప్రభావాలు కనిపిస్తుండటాన్ని దీర్ఘకాల కొవిడ్‌ (లాంగ్‌ కొవిడ్‌) అంటారు. కొవిడ్‌-19 వచ్చిన ప్రతి 8 మందిలో ఒకరికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయని ద లాన్సెట్‌ పత్రికలో ప్రచురితమైన తాజా పరిశోధనలో వెల్లడైంది. కొవిడ్‌-19 వచ్చి, కోలుకున్న రోగుల్లో దీర్ఘకాల లక్షణాలు ఏవేం కనిపిస్తున్నాయోనన్న సమాచారం అవసరం అత్యవసరంగా ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన నెదర్లాండ్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ గ్రోనింగెన్‌కు చెందిన ప్రొఫెసర్‌ జుడిత్‌ రాస్‌మలెన్‌ అన్నారు. ఇంతకుముందు జరిగిన చాలా పరిశోధనల్లో కొవిడ్‌ రానివారి విషయాలను పరిశీలించలేదని, లేదా కొవిడ్‌ నిర్ధారణ కావడానికి ముందు వారికున్న లక్షణాలను పరిశీలించలేదని ఆయన చెప్పారు. ఊపిరి అందకపోవడం, అలసట, రుచి, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలను ఈ పరిశోధనలో గమనించారు. దీర్ఘకాల కొవిడ్‌-19తో సంబంధమున్న 23 లక్షణాలను ప్రధానంగా పరిశీలించారు. 2020 మార్చి నుంచి 2021 ఆగస్టు వరకూ మొత్తం 76,422 మందికి ఈ ప్రశ్నలను 24 సార్లు పంపారు. వారిలో 4,231 మంది ఈ లక్షణాలున్నట్లు చెప్పారు. అయితే నెదర్లాండ్స్‌లో టీకా కార్యక్రమం మొదలవ్వడానికి ముందే ఈ పరిశోధన చేశారు. కొవిడ్‌ వచ్చి తగ్గిన మొదటి మూడు నుంచి అయిదు నెలల పాటు లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని