Coronavirus: కొవిడ్‌-19తో గుండె దెబ్బతినేది ఇలా..

కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ వల్ల కొందరిలో గుండె దెబ్బతింటున్న వైనాన్ని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెలుగులోకి తెచ్చారు.

Updated : 02 Oct 2022 08:12 IST

సిడ్నీ: కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ వల్ల కొందరిలో గుండె దెబ్బతింటున్న వైనాన్ని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెలుగులోకి తెచ్చారు. కొవిడ్‌, ఇన్‌ఫ్లూయెంజాలు తీవ్రస్థాయి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు కలిగించే వైరస్‌ల వల్లే వస్తున్నప్పటికీ గుండె కండజాలంపై ప్రభావం చూపే విషయంలో వాటి తీరు భిన్నంగా ఉంటోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తమ పరిశీలనల్లో కొవిడ్‌ బాధితుల గుండె కణజాలాల్లో వైరస్‌ రేణువులు కనిపించలేదన్నారు. డీఎన్‌ఏ దెబ్బతినడం, మరమ్మతులకు సంబంధించిన మార్పులు మాత్రం అక్కడ దర్శనమిచ్చాయన్నారు. ఈ రెండు పరిణామాలు జన్యుపరమైన అస్థిరతకు దారితీస్తాయని వివరించారు. మధుమేహం, క్యాన్సర్‌, రక్తనాళాల గోడలు గట్టిపడటం, నాడీ క్షీణత వ్యాధులతో దీనికి సంబంధం ఉందన్నారు. ఇన్‌ఫ్లూయెంజా వల్ల గుండె కణజాలాల్లో మితిమీరిన ఇన్‌ఫ్లమేషన్‌ జాడ కనిపించిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని