నేను గీత దాటానేమో.. క్షమించండి

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌’ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌కు ఆదివారం పాక్‌ హైకోర్టు శుక్రవారం వరకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. దీంతో మహిళా జడ్జిని బెదిరించిన కేసులో స్థానిక మెజిస్ట్రేట్‌ ఇమ్రాన్‌ పేరిట శనివారం జారీచేసిన అరెస్టు వారెంటు నుంచి ఆయనకు ఉపశమనం లభించింది.

Published : 03 Oct 2022 05:11 IST

పాక్‌ హైకోర్టుకు ఇమ్రాన్‌ అఫిడవిట్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌’ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌కు ఆదివారం పాక్‌ హైకోర్టు శుక్రవారం వరకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. దీంతో మహిళా జడ్జిని బెదిరించిన కేసులో స్థానిక మెజిస్ట్రేట్‌ ఇమ్రాన్‌ పేరిట శనివారం జారీచేసిన అరెస్టు వారెంటు నుంచి ఆయనకు ఉపశమనం లభించింది. సెలవురోజు అయినప్పటికీ హైకోర్టు ఇమ్రాన్‌ పిటిషన్‌ను ప్రత్యేకంగా విచారణ జరపడం గమనార్హం. మరోవైపు.. ‘విదేశీ కుట్ర’ ఆడియో టేపుల లీకేజీ విషయంలో ఇమ్రాన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పాక్‌ కేబినెట్‌ ఆదివారం ఆమోదం తెలిపింది.

* తనపై నమోదైన ఉగ్రవాద కేసుకు సంబంధించి ఇమ్రాన్‌ఖాన్‌ ఇస్లామాబాద్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ‘‘ఆగస్టు 20న ఇస్లామాబాద్‌ ర్యాలీలో మహిళా న్యాయమూర్తి విషయంలో నేను గీత దాటి ఉండొచ్చు. అందుకు క్షమాపణలు కోరుతున్నా. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాను’’ అని ఇమ్రాన్‌ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఆగస్టు 20న ఇస్లామాబాద్‌ ర్యాలీలో జెబా చౌధ్రి అనే మహిళా న్యాయమూర్తిని ఇమ్రాన్‌ బెదిరించారంటూ సద్దార్‌ మెజిస్ట్రేట్‌ అలి జావేద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఇమ్రాన్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని