విజయానికి చేరువలో నేపాలీ కాంగ్రెస్‌

నేపాల్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార నేపాలీ కాంగ్రెస్‌ (ఎన్‌సీ) పార్టీ నేతృత్వంలోని కూటమి విజయానికి మరింత చేరువైంది.

Published : 26 Nov 2022 04:49 IST

కాఠ్‌మాండూ: నేపాల్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార నేపాలీ కాంగ్రెస్‌ (ఎన్‌సీ) పార్టీ నేతృత్వంలోని కూటమి విజయానికి మరింత చేరువైంది. ఇప్పటివరకు 124 స్థానాల ఫలితాలు వెలువడగా.. వాటిలో 67 సీట్లు దాని ఖాతాలోకే వెళ్లాయి. ఇందులో ఒక్క ఎన్‌సీ వాటాయే 42. నేపాల్‌ ప్రతినిధుల సభలో మొత్తం సభ్యుల సంఖ్య 275. ఇందులో 165 మందిని ప్రత్యక్ష ఓటింగ్‌ విధానంలో ఎన్నుకుంటారు. మిగతా 110 మంది ఎన్నికను దామాషా విధానంలో పూర్తిచేస్తారు. ఏదైనా పార్టీ/కూటమి మొత్తంగా 138 స్థానాలను దక్కించుకోగలిగితే స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలుగుతుంది. తాజా ఎన్నికల్లో ఇప్పటికే ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎన్‌సీ.. తన మిత్రపక్షాలైన సీపీఎన్‌-మావోయిస్టు సెంటర్‌, సీపీఎన్‌ యూనిఫైడ్‌ సోషలిస్ట్‌ తదితర పార్టీలతో కలిసి సర్కారును ఏర్పాటుచేయడం ఇక దాదాపు లాంఛనప్రాయమే. ప్రతిపక్ష సీపీఎన్‌-యూఎంఎల్‌ నేతృత్వంలోని కూటమి ఇప్పటివరకు 38 స్థానాలు గెల్చుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని