Visa: వీసా అపాయింట్‌మెంట్‌ సమయాన్ని తగ్గించండి: బైడెన్‌కు ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ సిఫార్సు

వీసా అపాయింట్‌మెంట్‌కు వేచిఉండే సమయాన్ని అధిక సంఖ్యలో బ్యాక్‌లాగ్‌లు ఉన్న భారత్‌ వంటి దేశాలకు గరిష్ఠంగా రెండు వారాల నుంచి నాలుగు వారాలకు తగ్గించేలా విదేశీ వ్యవహారాల శాఖకు మెమో జారీచేసే అంశాన్ని పరిశీలించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ ఒకటి సిఫార్సు చేసింది. 

Updated : 09 Dec 2022 09:37 IST

వాషింగ్టన్‌: వీసా అపాయింట్‌మెంట్‌కు వేచిఉండే సమయాన్ని అధిక సంఖ్యలో బ్యాక్‌లాగ్‌లు ఉన్న భారత్‌ వంటి దేశాలకు గరిష్ఠంగా రెండు వారాల నుంచి నాలుగు వారాలకు తగ్గించేలా విదేశీ వ్యవహారాల శాఖకు మెమో జారీచేసే అంశాన్ని పరిశీలించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ ఒకటి సిఫార్సు చేసింది.  భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ సహా  పసిఫిక్‌ ద్వీపాలు, కొన్ని ప్రత్యేక ఆసియా దేశాల రాయబార కార్యాలయాల్లో వలసేతర వీసా, సందర్శక వీసా (బీ1/బీ2), తాత్కాలిక వర్కర్‌ వీసా (హెచ్‌, ఎల్‌, వో, పీ, క్యూ) అపాయింట్‌మెంట్లకు సంబంధించి అసాధారణ స్థాయిలో సుదీర్ఘ బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయి. ఒక్క భారత్‌నే పరిశీలిస్తే.. ఇది వెయ్యి రోజులను దాటిపోయింది. ఈ పరిస్థితి అమెరికాలో ఉన్న, విదేశాల్లో ఉన్న ఆసియన్‌ అమెరికన్‌, పసిఫిక్‌ ఐలాండర్లకు (ఏఏపీఐ) ఇబ్బందిగా మారింది. వారితోపాటు విద్యార్థులు, వ్యాపారవేత్తలు, సందర్శకులూ ఇబ్బంది పడుతున్నారు. 2020 మార్చి నుంచి కరోనా ఆంక్షలు, సిబ్బందిని తగ్గించుకోవడం తదితర కారణాల వల్ల వలసేతర వీసాల దరఖాస్తుదారులు  వేచిఉండే సమయం పెరిగిపోయినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం గతంలో ప్రకటించింది. ఈ నేలలో సమావేశమైన ఏషియన్‌ అమెరికన్లు, నేటివ్‌ హవాయియన్లు, పసిఫిక్‌ ఐలాండర్ల విషయంలో అధ్యక్షుడి సలహా మండలి.. భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, ఇతర దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా అమెరికా రాయబార కార్యాలయాల్లో వీసా అపాయింట్‌మెంట్‌ సమయాలు ఆలస్యం అవడాన్ని తగ్గించాలని శ్వేతసౌధానికి సిఫార్సు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని