Explosion: పేలుడు ధాటికి తునాతునకలైన ఇళ్లు.. సీసీ ఫుటేజీ వైరల్‌!

అమెరికాలో పేలుడు ధాటికి ఓ ఇల్లు తునాతునకలయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Published : 15 Aug 2023 19:55 IST

వాషింగ్టన్‌: అమెరికా (America)లో ఓ ఇంట్లో భారీ పేలుడు (House Explosion) ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడి  పిట్స్‌బర్గ్‌ (Pittsburgh) శివార్లలో ఇది చోటుచేసుకుంది. తాజాగా ఈ పేలుడు ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌ (Viral Video)గా మారింది. విధ్వంసకర పేలుడు ధాటికి అక్కడున్న ఇళ్లు తునాతునకలైనట్లు వీడియోలో కనిపిస్తోంది. పెద్దఎత్తున చెలరేగుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు.

పాఠశాల కింద 2వేలకు పైగా బాంబులు..!

ఈ ఘటనలో మొత్తం మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 12 ఇళ్లు బీటలు వారాయి. అయిదుగురు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందిన తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్లగా.. ఒకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పేలుడుకు కారణాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు. ఈ దిశగా విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో గ్యాస్, విద్యుత్ సేవలు నిలిపేశారు. పేలుడు కారణంగా ప్రభావితమైన బాధితులను ఆదుకునేందుకు రెడ్ క్రాస్, సాల్వేషన్ ఆర్మీలూ రంగంలోకి దిగాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని